ఎప్పటికీ ప్రారంభం కానీ ఆర్కే సీరియల్!

‘’తెలంగాణ భూ బాగోతాలన్నీ చెప్పాలంటే నెల రోజుల పాటు సీరియల్‌గా పత్రికల్లో ప్రచురించాల్సి వస్తుంది…’’ Advertisement ఇదీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే ఈ రోజు తన కొత్త పలుకులో రాసిన ఓ లైన్. తెలంగాణలో…

‘’తెలంగాణ భూ బాగోతాలన్నీ చెప్పాలంటే నెల రోజుల పాటు సీరియల్‌గా పత్రికల్లో ప్రచురించాల్సి వస్తుంది…’’

ఇదీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే ఈ రోజు తన కొత్త పలుకులో రాసిన ఓ లైన్. తెలంగాణలో వివాదాస్పద భూముల సెటిల్ మెంట్ లు జరిగిపోయి వేలాది కోట్లు ప్రభుత్వంలో వున్న పెద్దలు సంపాదించేస్తున్నారని ఆర్కే వెల్లడించారు. 

హైదరాబాద్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంలోని పెద్దలు ఎలా వేలాది కోట్లు సంపాదిస్తున్నారో కొన్ని పాయింట్లు చెప్పి, ఆపై..పైన ఉదాహరించిన లైన్ రాసారు. కానీ ఇక్కడ ఒకటే అనుమానం. తెలంగాణ భూ భాగోతాల సీరియల్ గా రాయడానికి నెల రోజులకు సరిపడా సరుకు వుండగా, ఆర్కే ఎందుకు స్టార్ట్ చేయడం లేదు అన్నది.

ఇలాంటి పరిస్థితి ఆంధ్రలో వుంటే ఆర్కే అసలు ఊరుకునేవారా? ఏ రోజు కు ఆ రోజు రాసుకుంటూ వెళ్లేవారు కదా? తెలంగాలో వివాదాస్పద భూములు గత ఏడాది కాలంగా సెటిల్ అయిపోతున్నాయని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఆంధ్రకు చెందిన బడా బిల్డర్లకు ఎవరి కోటా వారికి ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి. ఇంతకాలం బీడుపట్టి, పిచ్చి తుప్పలు లేచి అసలు ఎవరి భూములో తెలియనవి అన్నీ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా మారిపోయాయి.

ఇవన్నీ ఆర్కేకు తెలుసు.ఈ రోజు ఇదో టీజర్ అన్నట్లుగా తన కొత్త పలుకులో వెల్లడించారు. నెల రోజుల సీరియల్ కు సరిపడా ముడిసరుకు తన దగ్గర వుందని చిన్నగా హెచ్చిరించారు కూడా. కానీ ఎందుకు ఆ సీరియల్ స్టార్ట్ చేయడం లేదు అన్నదే అనుమానం. అసలు ఎప్పటికీ ఈ సీరియల్ ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యం లేదు.