శ్రీలీల..రవితేజ..ఎవరి వల్ల ధమాకా అంత పెద్ద హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది అని కామన్ ప్రేక్షకుడు ఎవరిని అడిగినా సింపుల్ గా వచ్చే ఆన్సర్..శ్రీలీల డ్యాన్స్ లు..పాటలు..అనే. ధమాకా సినిమా అనేది వాస్తవానికి ఓ సాదా సీదా సినిమా. అలాంటి సినిమాను పెద్ద హిట్ చేసింది శ్రీలీల ఎనర్జీ తో కూడిన డ్యాన్స్ లు. పాటలు, ఆ తరువాతే రవితేజ.
ఈ విషయం చెప్పడానికి అస్సలు మొహమాటపడలేదు మీడియా. ఆ సినిమా విడుదల తరువాత ఇదే తరహాలో వార్తలు వస్తే రవితేజ పీఆర్ టీమ్ తెగ ఇబ్బంది పడింది. శ్రీలీల హీరోనా? రవితేజ హీరోనా? శ్రీలీల కోసం వస్తారా? ఏం వార్తలు ఇవి అని తెగ సతాయించింది.
కట్ చేస్తే రావణాసుర సినిమా వచ్చింది. అయిదుగురు హీరోయిన్లు..రవితేజ..మరి రెండో రోజుకు ఎందుకు తేడా కొట్టింది? మరి రవితేజ హీరో కదా? శ్రీలీల లేకపోయినా, డ్యాన్స్ లు లేకపోయినా, పాటలు లేకపోయినా కలెక్షన్లు కుమ్మేయాలి కదా? పైగా ధమాకా కన్నా రావణాసుర కాస్త కంటెంట్ వున్న సినిమా. లాజిక్ లు వున్నా..లేకున్నా. మరి ఎందుకు జనం రాలేదు. రవితేజ హీరో కదా?
ధమాకా హిట్ కు కారణం శ్రీలీల అని రవితేజ పీఆర్ టీమ్ ఒప్పుకోకున్నా సినిమా జనం ఒప్పుకున్నారు. మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, బాలకృష్ణ ఇలా అందరి సినిమాల్లో శ్రీలీలనే. ధమాకా ముందు ఎన్ని డిజాస్టర్లు రవితేజకు. ధమాకా తరువాత ఎన్ని అన్నది ఇప్పుడు చెప్పేది కాదు. వాల్తేర్ వీరయ్య హిట్ కు రవితేజ భాగం ఎంత అన్నది ఎవరికి వారే లెక్క వేసుకోవచ్చు.
ఇఫ్పటికైనా ధమాకా హీరో శ్రీలీల అని ఒప్పుకోవాల్సిందే ఎవరైనా.