హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు దేవదాయశాఖ ఉద్యోగులు. ముఖ్యంగా సింహాచలం దేవస్ధానం, అన్నవరం దేవస్థానం ఉద్యోగులు. రాజకీయ అండదండలతో దేవాదాయ శాఖకు డిఫ్యాక్టో మినిస్టర్ అన్నట్లుగా నడిచింది ఓ ‘స్వామీజీ’ వ్యవహారం. ఇప్పుడు ఆ అజమాయిషీ విరగడయింది. తన కనుకసన్నలలో నడిపించారు సిబ్బంది బదిలీలు ఇతరత్రా వ్యవహారాలు. పీఠంలో ఏం జరిగినా ఆలయాల నుంచి డిప్యూటేషన్ మీద వేద పండితులు పరుగులు పెట్టాల్సిందే.
ఆలయంలో జరిగే పూజలకు కాస్త డబ్బు ఖర్చు చేసి పురోహితులను పిలిపించుకోలేరా? అది కూడా ప్రభుత్వం అండతో ఫ్రీగా సాగిపోవాలా? చినజీయర్ స్వామి కి తెలుగుదేశం అనుబంధం కొంత వుండేది. కానీ ఆయన ఎపుడూ ఇలా దుర్వినియోగం చేసిన దాఖలా లేదు. కానీ ఈ స్వామీజీ మామూలుగా కాదు. గమ్మత్తేమిటంటే ఎవరైనా స్వామీజీ తన శిష్యుల్లో సమర్ధులను ఎంపిక చేసి, పీఠం వారసత్వం అందిస్తారు. కానీ ఈ సదరు స్వామీజీ మాత్రం తన దగ్గర బంధువును శిష్యుడిగా తయారు చేసి, ఆపై వారసత్వ పగ్గాలు అప్పగించారని టాక్.
ప్రభుత్వం నుంచి అణా కానీ కి భూములు అందుకోవడం సరే. అక్కడితో సరిపెట్టుకోక, రకరకాలుగా లబ్ది పొందారని, ప్రభుత్వాన్ని ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకున్నారని టాక్. ఇప్పుడు ప్లేట్ తిప్పేసారు. ఏదో అయిపోతుంది అని భయం లేదు. ఎందుకంటే సదరు స్వామికి తెలుగుదేశం బంధాలు కూడా వున్నాయి. తెలుగుదేశం జనాల కంట్రోల్ లో వున్న ఓ ఆలయాన్ని సదరు స్వామీజీ చేతిలోనే పెట్టారు చాన్నాళ్ల క్రితం. ఆ విధంగా అటు బంధాలు వుండనే వున్నాయి.
అందువల్ల ప్రస్తుతానికి పలుకుబడి ఆగుతుంది తప్ప, కక్ష సాధింపులు వుండకపోవచ్చు