పప్పెట్‌ను చేస్తారా? పరిటాలను చేస్తారా?

తెలుగుదేశం పార్టీ నిజమైన బంగారు భవిష్యత్తును కోరుకుంటున్న వారు ఇప్పుడు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మహానాడు సందర్భంగా లోకేష్ చెప్పిన మాటలు వారిలో కొత్త ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవినుంచి…

తెలుగుదేశం పార్టీ నిజమైన బంగారు భవిష్యత్తును కోరుకుంటున్న వారు ఇప్పుడు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. మహానాడు సందర్భంగా లోకేష్ చెప్పిన మాటలు వారిలో కొత్త ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవినుంచి తాను ఈదఫా తప్పుకుంటానని లోకేష్ ప్రకటించడంతో.. పార్టీకి మంచి రోజులు వస్తాయేమోనని వారంతా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్తగా ఆ పదవిని ఎవరి చేతుల్లో పెడతారు? ప్రధాన కార్యదర్శిగా పార్టీ అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ బాధ్యత పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనేది వారికి టెన్షన్ గా కూడా ఉంది. 

తెలుగుదేశం అంటేనే కమ్మవారి పార్టీ అనేది అందరూ ఆమోదించిన సంగతే. ఆ పార్టీ కూడా.. కమ్మకుల ఓటు బ్యాంకు, వారు ప్రభావితం చేయగలిగిన ఇతర కులాల ఓటు బ్యాంకు మీద ఆధారపడే రాజకీయం నెరపుతూ ఉంటుంది. నామ్ కే వాస్తేగా కొన్ని ఇతరకులాలు, బీసీ ఎస్సీలకు అక్కడ పదవులు కట్టబెడతారు. మొత్తంగా చూసినప్పుడు.. పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉండే, పార్టీ తమది అని రొమ్ము విరుచుకుంటూ ఉండే కమ్మవారందంరూ.. కమ్మ వారి నేతృత్వంలోనే పార్టీ ఉండాలని అనుకుంటారు.. అది సహజం. 

అక్కడే ఇప్పుడు డైలమా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు సరేసరి.. ఇతర కీలక నాయకుల్లో కమ్మవారు ఎందరున్నా సరే.. ఆ కులం వాళ్లంతా.. కమ్మనాయకుడుగా గుర్తించిన వ్యక్తి పరిటాల రవి. కమ్మకుల హీరోగా వారందరూ ఆయనను ఆరాధించారు. కులం ప్రాతిపదిక మీద చూసినప్పుడు.. కమ్మనాయకుడిగా చంద్రబాబుకంటె ఎక్కువ క్రేజ్ ఆ కులంలో పరిటాల రవికే ఉన్నదనడంలో సందేహం లేదు. పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయంగా చాలా యాక్టివ్ గానే పార్టీని లోకల్ గా నడిపిస్తున్నాడు. అయితే.. పరిటాల శ్రీరాం కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధ కమ్మపెద్దల్లో ఉంది. 

పార్టీని లోకేష్ ముంచేస్తాడనే భయం ఉన్నది కూడా వీరిలోనే. ఇప్పుడు లోకేష్ తాను తప్పుకుంటాను అని చెప్పగానే.. ఆ పదవిని పరిటాల శ్రీరాం చేతిలో పెడితే.. పార్టీని చాలా డేషింగ్ గా ముందుకు తీసుకువెళ్తాడనే అభిప్రాయం పార్టీలోని కమ్మ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. పరిటాల వారి చేతికి వెళితే.. పార్టీ ఖచ్చితంగా డేషింగ్ గా మారుతుందని, బాగుపడుతుందని వారి ఆశ. అయితే పరిటాల శ్రీరాం, తాను నారా లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలాగా పనిచేస్తాడని అనుకోలేం. స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. అది లోకేష్ కు నచ్చకపోవచ్చు. తాను పదవిని వదలుతానని లోకేష్ చెప్పాడే తప్ప.. పెత్తనం వదులుకునే ఆలోచన ఆయనకు లేకపోవచ్చు. 

అందుకే.. తాను తప్పుకుని… తన చేతిలో కీలుబొమ్మలాంటి ఒక బీసీ, ఎస్సీ యువనేతను తీసుకువచ్చి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో పెట్టవచ్చుననే అంచనాలు కూడా సాగుతున్నాయి. తద్వారా తాము బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం అనడంతో పాటూ.. వారినుంచి మైలేజీ ఆశించవచ్చు. అలాగే కీలుబొమ్మ నేతను తాము తలచినట్టుగా ఆడించవచ్చు అని వారి ఉద్దేశం ఉంటుంది. 

అందుకే.. ఇన్నాళ్లూ పప్పునాయుడుగా ప్రత్యర్థులు పిలిచే లోకేష్ నిర్వహించిన పార్టీ కొత్త జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును పప్పెట్ లాంటి కీలుబొమ్మకు అప్పగిస్తారా.. పరిటాల లాంటి డేషింగ్ నాయకుడికి అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.