Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఈకలు పీకడం మొదలైంది

ఈకలు పీకడం మొదలైంది

విశాఖలో గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ సక్సెస్ అయింది. గతంలో బాబు హయాంలో ఎలాగైతే పలు ఒప్పందాలు చేసుకున్నారో, ఇప్పుడు కూడా అలాగే పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

బాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎన్ని కార్యరూపం దాల్చాయో తెలిసిందే. బాబు సమ్మిట్ చేసినపుడల్లా నానా హడావుడి చేసిన సామాజిక ‘కుల’ మీడియా ఈసారి అలాంటి హడావుడికి దూరంగా వుండి సన్నాయి నొక్కులునొక్కడం మొదలు పెట్టింది. సమ్మిట్ ముగియగానే ఇక కోడిగుడ్డుకు ఈకలు పీకడం మొదలుపెట్టింది.

ఇందులో మనవాళ్లవి ఎన్ని..వాళ్ల వాళ్లవి ఎన్ని? అసలు టాటా..బిర్లా ఎందుకు రాలేదు. ఇలా నానా రకంగా ఈకలు పీకడం మొదలుపెట్టారు. ఎవరు వచ్చారు..ఎవరు వెళ్లారు అన్నది కాదు పాయింట్. ఓ ఏడాది లోగా ఎన్ని ఒప్పందాలు మెటీరియలైజ్ అవుతాయి అన్నది కీలకం. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు కూడా బాబుగారి ఒప్పందాల బాటనే పడితే అప్పుడు ఇలాంటి వ్యవహారాలు పుష్కలంగా చేయచ్చు.

గమ్మత్తేమింటే విశాఖ నుంచి భోగాపురానికి కొన్ని వేల కోట్లతో అద్భుతమైన ఆరు లైన్ల రహదారి మంజూరయింది. అది కేంద్రం ప్రాజెక్టే కావచ్చు. జగన్ ప్రభుత్వం కేంద్రంతో పెట్టుకున్న సాన్నిహిత్య, సానుకూల ధోరణి వల్లనే కదా అది సాధ్యమైంది. దానిని కూడా ప్రశంసించే తీరుబాటు లేకపోయింది.

మొత్తం ఎన్ని వచ్చాయి..వాటిల్లో పనికి రానివి ఎన్ని? రెడ్ల కంపెనీలు ఎన్ని? ఇలా ఎముకలు లెక్కపెట్టడానికే ఆసక్తి ఎక్కువగా వుంది. రాష్టం అధోగతి…అభివృద్ది లేదు..జగన్ వల్ల అనే వాళ్లు, నిజంగా రాష్ట్రం మీద ప్రేమ వుంటే జగన్ ఏదో ప్రయత్నం చేస్తున్నపుడు సహకరించాలి కదా? అంటే జగన్ అభివృద్ది చేస్తే మళ్లీ బాబుకు ఇబ్బంది అనా ఈ బాధ అంతా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?