Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఫాక్స్ కాన్ మాయలో దక్షిణాది రాష్ట్రాలు

ఫాక్స్ కాన్ మాయలో దక్షిణాది రాష్ట్రాలు

ఫాక్స్ కాన్...ఇది తైవాన్ కి చెందిన కంపెనీ. యాపిల్ సంస్థకి సైతం అవసరమైన ఎలక్ట్రానిక్స్ ని తయారు చేసి సప్లై చేస్తున్న సంస్థ. ఈ కంపెనీ అధినేత తమని కలిసినట్టు హైదరాబాదులో వారి పరిశ్రమ పెడుతున్నట్టు దానివల్ల లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్టు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ట్వీట్ చేసారు. 

సరిగ్గా ఇలాంటి ట్వీట్ నే కర్నాటక ముఖ్యమంత్రి కూడా పెట్టడంతో చర్చకు దారి తీసింది. అసలు ఫాక్స్ కాన్ పెట్టుబడి కర్నాటకలో పెడుతోందా లేదా తెలంగాణాలోనా అని నేరుగా ఫాక్స్ కాన్ అధినేతల్నే అడిగితే వాళ్లు ఇచ్చిన సమాధానం ఇంకా ఏదీ తేల్చలేదు, అన్నీ చర్చల్లోనే ఉన్నాయని. 

రష్ట్రాల మధ్యలో పోటీ పెట్టి అధిక రాయితీ కొట్టేయాలన్నది ఇలాంటి కంపెనీల లక్ష్యం. రాయితీ అంటే ప్రధానంగా టాక్స్ బెనిఫిట్. ఉచితంగా భూమిని ఇచ్చి, అన్ని వెసులుబాట్లు చేసి, రోడ్లు వైగారాలు వేసిపెట్టి ఆ పైన టాక్స్ మినహాయింపు కూడా మనం ఇవ్వాలన్నమాట. మరింక ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? పోనీ ఉద్యోగాలా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. కేసీయార్ పేర్కొన్న లక్ష ఉద్యోగాల విషయంలో పూర్తి నిజం లేదని ఆ కంపెనీయే పేర్కొంది. 

ఇలాంటి తలతిక్క రాయితీలే ఇచ్చొ చంద్రబాబు కియా కంపెనీని తీసుకురావడం జరిగింది. చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ రాష్ట్రానికి, తద్వారా దేశానికి ఎగ్గొట్టిన పన్ను ఏకంగా రూ 20000 కోట్ల పైమాట. ఈ లెక్కన ఎంత ఆదాయం దేశం కోల్పోతోంది? ఆ మాత్రం చేయకపోతే విదేశీ కంపెనీలు రావు అని అనుకోవడం అవివేకం.

ప్రపంచంలో ఏ కంపెనీ అయినా భారతదేశాన్ని ఆశ్రయించుకుని ముందుకెళ్లాల్సిందే. వాటికి వేరే దిక్కు లేదు. ఇక్కడ మానవవనరులు ఎక్కువ. జనాభాలో అధికశాతం యువత ఉంది. జనాభాకి కూడా విదేశీ బ్రాండ్స్ పై వ్యామోహమెక్కువ. కనుక చచ్చినట్టు ఈ దేశం చెప్పినట్టు విని ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవాలి..అంతే కానీ రాష్ట్రాల మధ్యన పోటీలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి కాదు.  

రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు డిమాండ్ అండ్ సప్లై కి అనుగుణంగా ఉండాలి. బహుళజాతి కంపెనీల అవసరాల రీత్యా భారతదేశానికి డిమాండ్ ఉందన్నది గుర్తించాలి. పక్క రష్ట్రాలు కూడా దేశంలోని అంతర్భాగమే. అలాగే తాము తీసుకునే నిర్ణయాలు దేశానికి బయటినుంచి కొత్త ఆదాయం తెచ్చేదిగా ఉండాలి కానీ నష్టం కలిగించేలా ఉండకూడదు. అందుకే ఈ పెట్టుబడుల విషయంలో కేంద్రం కూడా రాష్ట్రాలకు కొన్ని కచ్చితమైన నియమాలు పెట్టాలి. లేకపోతే తెల్లవాడు 400 ఏళ్ల క్రితం వర్తకమని వచ్చి క్రమంగా నెత్తి మీద కూర్చున్నట్టు ఈ బహుళజాతి కంపెనీలు అదే పని చేస్తాయి. 

మొన్నటికి మొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏవో డిమాండ్స్ చేస్తే మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి మొహం చాటేసాడు. కానీ "చెరువు మీద అలిగితే.." సామెత లాగ ఎవడికి నష్టం? ఆ తత్వం బోధ పడ్డాక తోక ఊపుకుంటూ ఎలాన్ మస్క్ ఇక్కడికి రావాల్సిందే..పెట్టుబడి పెట్టి కార్లు అమ్ముకోవాల్సిందే. 

కనుక ఫాక్స్ కాన్ మాయలో రాష్ట్రాధినేతలు పడకూడదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా దేశానికి నష్టం తీసుకురాకూడదు. ఈ విషయంలో పైన సూచించినట్టు రూల్స్ విషయంలో కేంద్రం ప్రమేయం తప్పనిసరిగా ఉండాలి. 

ఈ విషయంలో తాజాగా వైజాగ్ సమిట్ లో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల ఒప్పందాలు తీసుకొచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి రాయితీలివ్వడా అని అడొగొచ్చు. ఆయన ఇవ్వడు. ప్రభుత్వానికి నేరుగా ఆదాయం తీసుకురాని పరిశ్రమలకి ప్రభుత్వభూములివ్వడు. "భూములు కేటాయిస్తాం, అన్ని రకాల అవసరాలూ తీరుస్తాం...చక్కగా ఉత్పత్తులు చేసుకోండి..నిక్కచ్చిగా పన్ను కట్టండి"..ప్రస్తుతానికి ఇదే ఆయన ధోరణి. 

ఒకవేళ రాష్ట్రాల మధ్యన పోటీకి లోబడి పన్ను మినహాయింపులిస్తే పై విమర్శ లిస్టులో నిర్మొహమాటంగా ఆయనని కూడా చేర్చాల్సి ఉంటుంది. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?