హంగ్ దిశగా తెలంగాణ?

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకులంగా వస్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం భారాస కు అనుకూలంగా వున్నాయి. టోటల్ గా అన్ని పోల్స్ కలిపి…

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకులంగా వస్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం భారాస కు అనుకూలంగా వున్నాయి. టోటల్ గా అన్ని పోల్స్ కలిపి విశ్లేషిస్తే రెండు అంశాలు క్లారిటీగా వున్నాయి. 

ఒకటి తెలంగాణలో హంగ్ రావడం, రెండవది ఉప్పు.. నిప్పు లాంటి భాజపా, ఎంఐఎం కలిపి పన్నెండు నుంచి పదిహేను సీట్లు సంపాదించుకోవడం. ఇదే ఇప్పుడు కీలక పాయింట్ గా కనిపిస్తోంది.

ఎంఐఎం మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు వెళ్తే తప్ప, లేదా కాంగ్రెస్ కు కనీసం 70 సీట్లు వస్తే తప్ప అధికారం సాధించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సర్వేలు అన్నీ భారాస కు కనీసం 40 నుంచి 45 సీట్లు అంచనా వేస్తున్నాయి. ఈ సీట్లకు భాజపా, ఎంఐఎం సీట్లు కలిస్తే మాత్రం కాంగ్రెస్ వైపు బలం అరవై సీట్లకు పరిమితం అయిపోతుంది. అప్పుడు హంగ్ అనేది తప్పదు.

అలాంటి టైమ్ లో కాంగ్రెస్ ను ఆదుకునే అవకాశం ఒక్క ఎంఐఎం కు మాత్రమే వుంది. కానీ ప్రస్తుతానికి అయితే భారాస-ఎంఐఎం సంబంధాలు బాగానే వున్నాయి. సాధారణంగా ప్రజలు ఎప్పుడూ హంగ్ తీర్పు ఇవ్వరు. స్పష్టమైన తీర్పునే ఇస్తారు. అలా ఇస్తే కనుక కాంగ్రెస్ 70 సీట్లు పైగానే గెల్చుకునే అవకాశం వుంది. అదే జరిగితే ఏ సమస్య లేదు.

అలా కాకుండా కాంగ్రెస్ కనుక 60 కి పరిమితం అయితే మాత్రం తెలంగాణలో హంగ్ తప్పదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని క్లయిమ్ చేసుకోవ‌చ్చు. కానీ నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వుంటుంది. కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగాల్సి వుంటుంది.