ఇక మీడియా ఇలాగే వుంటుందా?

అయిదేళ్ల పాటు రాసిందే రాసుకుంటూ, రకరకాల యాంగిల్స్ వెదుకుతూ, ఆంధ్రలో ఏ చిన్న తప్పు ఏ మారుమూల జరిగినా జగన్ కే దాన్ని ఆపాదిస్తూ, ఎంత యాగీ చేయాలో అంతా చేస్తూ వచ్చింది మెజారిటీ…

అయిదేళ్ల పాటు రాసిందే రాసుకుంటూ, రకరకాల యాంగిల్స్ వెదుకుతూ, ఆంధ్రలో ఏ చిన్న తప్పు ఏ మారుమూల జరిగినా జగన్ కే దాన్ని ఆపాదిస్తూ, ఎంత యాగీ చేయాలో అంతా చేస్తూ వచ్చింది మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియా. అలాగే దాని అడుగు జాడల్లోనే నడిచాయి చాలా డిజిటల్ మీడియాలు.ఇక హార్డ్ కోర్ తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ సంగతి చెప్పనక్కరలేదు.

సరే మొత్తానికి ప్రభుత్వం మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు వైకాపా జనాల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు టోటల్ గా మీడియా మౌనం. ఒక్క మీడియా సంఘటనలను రిపోర్ట్ చేయడం లేదు. పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మరింత రెచ్చగొట్టేలా, అప్పుడు మీరు చేసారు కదా, ఇప్పుడు మా వంతు అనేలా పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇంకా వుంది. ఇది మొదలే అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోయింది.

తెలంగాణలో కూడా జగన్ మాదిరిగానే కొత్త కొత్త బీర్ బ్రాండ్ లు ప్రవేశ పెట్టారు. ఆంధ్రలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత యాగీ చేసిందో. సోషల్ మీడియాలో ఎన్ని సెటైర్ వీడియోలో. ఇప్పుడు మాత్రం రెండు రకాల మీడియాలు సైలంట్. మాట మాత్రం ప్రస్తావన లేదు.

ఆంధ్రలో రివర్స్ టెండరింగ్ అని, గత ప్రభుత్వ నిర్ణయాల మార్పు అని జగన్ చర్యలు తీసుకుంటే వేల కోట్లు వృధా అంటూ బ్యానర్ వార్తలు.. ప్రచారం. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాలు, టిఎస్ నుంచి టిజి ఇలా రకరకాల మార్పులకు దగ్గర 2700 కోట్ల ఖర్చు. పొరపాటున కూడా రాస్తే ఒట్టు.

ఇంకో అయిదేళ్లు మీడియా ఇలాగే వుంటుంది. ఆంధ్రలో ప్రభుత్వం వైపు నుంచి ఏ తప్పు జరిగినా ఇక మీడియాలో కనిపించదు. కానీ ఏ మీడియా అయినా ఒకటి గమనించాలి. బాధితులకు తెలుసు కదా ఏం జరిగిందో? అది జగన్ టైమ్ లో అయినా చంద్రబాబు టైమ్ లో అయినా. లోకల్ గా ప్రజలకు తెలుస్తుంది కదా ఏ జరిగిందో. ఆ నిప్పు రవ్వ జనం గుండెల్లో అలాగే వుంటుంది. సమయం వచ్చినపుడు జ్వాలగా మారుతుంది.

మొన్నటికి మొన్న జరిగింది అదే. రేపు జరగబోయేది అదే..మొదటిలోనే ఆపకుంటే.