మీడియా టైకూన్, ఈనాడు రామోజీరావు అస్వస్థతకు గురయ్యారు. వృద్దాప్య సమస్యలు, కొంతకాలం స్టంట్ వేసి వుండడం, ఇప్పుడు కొత్తగా శ్వాసకోశ సమస్యలు రావడంతో రామోజీ రావును ఈ మధ్యాహ్నం మూడు గంటలకు రామోజీ ఫిలిం సిటీ నుంచి స్టార్ హాస్పిటల్ కు మార్చారు.
ప్రస్తుతం నానక్ రామ్ గుడా స్టార్ హాస్పిటల్ లో రామోజీరావు కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. రామోజీ రావు చిరకాలంగా ఇంటికే పరిమితమై వున్నారు. వృద్దాప్యం కారణంగా వుండే శారీరక సమస్యలు వున్నాయి. అందువల్ల ఇంటి దగ్గరే డాకర్లు చికిత్సలు అందిస్తూ వస్తున్నారు.
అయితే ఈ రోజు శ్వాస సమస్య ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామోజీ ఆరోగ్యం స్థిరంగానే వుందని, అయితే కొన్ని గంటలు గడిస్తే తప్ప, పూర్తి సమాచారం చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.