Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇందుకు కదా జగన్ భయపడింది

ఇందుకు కదా జగన్ భయపడింది

గత ఒకటి రెండేళ్లుగా జగన్ పర్యటనలకు విపరీతమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ప్రతిపక్షాలు విపరీతంగా వెక్కిరిస్తూ వస్తున్నాయి. పరదాలు కడుతున్నారని, పాదయాత్ర చేసినపుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అని వెక్కిరించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేసాయి. కానీ జగన్ కు తెలుసు. ప్రతిపక్షాలు తనను ఎందుకు రెచ్చగొడుతున్నాయో.

నిజానికి జగన్ ను ఢీకొనడం ఇంత కష్టం అవుతుందని తెలిస్తే, పాదయాత్ర టైమ్ లోనే ఏదో ఒకటి ఎవరో ఒకరు చేసి వుండేవారు. తెలియక వదిలేసారు. ఇప్పుడు జగన్ ను ఎలా కిందకు లాగాలో తెలియక ఫ్రస్టేషన్ లో వున్నారు. వాళ్ల ఏమైనా చేయడానికి తెగిస్తారనే, ఎంత రెచ్చకొట్టినా అలానే జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఎన్నికల టైమ్.. జనంలోకి వెళ్లక తప్పదు. అందుకే వెళ్తున్నారు. ఓ మీటింగ్ లో చెప్పు వేయించారు. అదిగో జగన్ అంటే జనాలకు ద్వేషం మొదలైంది..అందుకే చెప్పులు వేస్తున్నారు అని ప్రచారం సాగించారు. ఇప్పుడు రాయి వేయించారు. కానీ రివర్స్ లో ఇది కోడి కత్తి టైపు డ్రామా అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం జనం రాయి వేసారు అనడం లేదు. వేయించుకున్నారు అంటున్నారు. నిజంగానే వేయించుకుని వుంటే, అది కంటికి తగిలి వుంటే… బుర్ర వున్నవాళ్లు మాట్లాడే మాటలేనా అవి.

నిజంగా తెలుగుదేశం జనాల దిగజారుడు తనం పెరిగిపోతోంది. రాయి వేయించారో, వేసారో మొత్తానికి తగిలింది. గాయమైంది. కానీ దాని వల్ల ఎక్కడ సింపతీ వచ్చేస్తుందో అని ముందే, జగన్ నే రాయి వేయించుకున్నాడు అంటూ యాగీ ఆరంభించేసారు.

ఇక జగన్ జాగ్రత్తగా వుండాలి. ఎవరు ఎంతకైనా తెగిస్తారు.

నిజానికి జగన్ కన్నా జాగ్రత్తగా వుండాల్సింది పవన్. పొరపాటున పవన్ మీద ఏమాత్రం చిన్న దాడి జరిగినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయి. దాన్ని అనుభవించాల్సింది కూడా అధికారపార్టీనే.

రాను రాను రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనడానికి ఇవే సూచనలు. ఇంకా నెల రోజులు వుంది. ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?