Advertisement

Advertisement


Home > Politics - Andhra

ముస్లిం రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై ఏపీ బీజేపీ ప్ర‌చారం

ముస్లిం రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై ఏపీ బీజేపీ ప్ర‌చారం

మత‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకించాల‌ని బీజేపీ ఒక ప‌రిపాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు తెలుగు రాష్ట్రాలేమీ మిన‌హాయింపు కాదు. బీజేపీకి జాతీయ విధానాలే త‌ప్ప‌, ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా వుండ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింల‌కు నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో తీసుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత కూడా... రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగుతున్నాయి.

అయితే ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి కామెంట్స్ తీవ్ర వివాదాస్ప‌ద‌మయ్యాయి. ముస్లింల రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని అమిత్‌షా అన్న‌దాన్ని, బీజేపీ అధికారంలోకి వ‌స్తే రాజ్యాంగ విరుద్ధ‌మైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని అన్న‌ట్టుగా ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది.

ఈ ఫేక్ వీడియో ప్ర‌చారంపై బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చారు. ఇదిలా వుండ‌గా ముస్లింల రిజ‌ర్వేష‌న్ ర‌ద్దుపై ఏపీ బీజేపీ కూడా విస్తృత‌మైన ప్ర‌చారం చేస్తోంది. అమిత్‌షా కేవ‌లం ముస్లింల రిజ‌ర్వేష‌న్ మాత్ర‌మే ర‌ద్దు చేస్తామ‌న్నార‌ని, ఇందుకు సంబంధించి అమిత్‌షా వాస్త‌వంగా మాట్లాడింది, అలాగే ఫేక్ వీడియోల‌ను ఎక్స్ వేదిక‌గా షేర్ చేయ‌డం విశేషం.

ఏపీలో కూడా ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌నేది బీజేపీ పాల‌నాప‌ర‌మైన విధాన‌మ‌ని ఆ పార్టీ ఏపీ శాఖ చెప్ప‌క‌నే చెబుతోంది. అందుకే అమిత్‌షా వీడియోను విస్తృతంగా ప్ర‌చారంలో పెట్టింది ఏపీ బీజేపీ శాఖ‌. ఈ ప‌రిణామం టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌మే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?