Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇప్పుడు కడప గూండాలు రారా బాబూ?

ఇప్పుడు కడప గూండాలు రారా బాబూ?

వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసిన టైమ్. వేరే జిల్లాల నుంచి విశాఖ మీద వ్యాపార పరంగా, రాజకీయపరంగా పట్టు సాధించేసి, తమ ఆధిపత్యం ఎక్కడో పోతుందో అని భయపడిన సామాజిక వర్గం విపరీతంగా విష ప్రచారం సాగించింది.

విజయమ్మ విజయం కోసం కడప గూండాలు వచ్చేసారని తెగ ప్రచారం సాగించింది. విశాఖలో వాళ్లు వీర విహారం చేస్తున్నరని అప్పటికి అందు బాటులో వున్న సోషల్ మీడియాలో తెగ తప్పుడు ప్రచారం సాగించి, స్థానికలను భయ భ్రాంతులకు గురిచేసి, విజయమ్మ ఓటమి పాలయ్యేలా చూసారు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన సిఎమ్ రమేష్ ను కూటమి అభ్యర్థిగా అనకాపల్లి బరిలోకి దింపారు. సిఎమ్ రమేష్ ఏ పార్టీ మీద నుంచి పోటీ చేస్తున్నారు అన్నది పక్కన పెడితే చంద్రబాబుకు ఎంత ఆప్తుడు అన్నది తెలిసిందే. మరి సిఎమ్ రమేష్ కోసం కడప గూండాలు ఇప్పుడు రంగంలోకి దిగవా? ఇప్పుడు అంతా ప్రశాంతంగా వుంటుందా? అల్ల కల్లోలం కాదా?

అప్పట్లో విజయమ్మను నాన్ లోకల్ అని ముద్ర వేసారు. మరి ఇప్పుడు సిఎమ్ రమేష్ పక్కా లోకల్ నా? విశాఖ నుంచి కూటమి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు (ప్రకాశం జిల్లా), శ్రీభరత్ (తూర్పు గోదావరి జిల్లా), వెలగపూడి (కృష్ణాజిల్లా), సిఎమ్ రమేష్ (రాయలసీమ), ఇలా నాన్ లోకల్స్ అందరినీ ఉత్తరాంధ్ర మీద రుద్దుతోంది కూటమి. కానీ గతంలో విజయమ్మ వస్తే మాత్రం నానా యాగీ, నానా తప్పుడు ప్రచారం.

తెలుగుదేశం మూలాల్లో దానికి సామాజిక వర్గ దారణ వైఖరికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?