అన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!

దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయండి అన్న చందంగా వుంటుంది ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల వైఖరి.. ప్రభుత్వ నిర్ణయం.

దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయండి అన్న చందంగా వుంటుంది ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల వైఖరి.. ప్రభుత్వ నిర్ణయం. జగన్ ప్రభుత్వం టైమ్ లో అక్కడ విమానాశ్రయం, ఇక్కడ ఎయిర్ పోర్ట్ అంటే వెక్కిరించారు. మీమ్స్ చేసారు. వేళాకోళం అడారు సోషల్ మీడియాలో, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మూల పేట దగ్గర ఎయిర్ పోర్ట్, తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఒకటి, వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం దగ్గర ఇంకోటి అంటున్నారు తెలుగుదేశం మంత్రులు, పెద్దలు.

సరే పాతికేళ్ల తరువాత పరిస్థితి ఎలా వుంటుందో అలా వుంచితే ఇప్పుడు నిర్మిస్తున్న విశాఖ భోగాపురం ఎయిర్ పోర్టు శ్రీకాకుళం కు 50 కిలోమీటర్ల దూరం. పోనీ మూల పేటకు 100 కిలోమీటర్ల దూరం అనుకున్నా, శ్రీకాకుళానికి కూడా మూలపేట 50 కిలోమీటర్ల దూరం అవుతుంది. పోనీ ఇటు బొబ్బిలి, పాలకొండ వాళ్లకి ఏమైనా దగ్గరా అంటే అదీ కాదు. మరి దేనికి? పోర్ట్ ఎగుమతులకా? లేక పోర్ట్ కు వచ్చే పారిశ్రామికవేత్తల ప్రయివేట్ జెట్ ల కోసమా?

సరే, దాని ముచ్చట అలా వుంచుదాం. అన్నవరం-తుని మధ్య విమానాశ్రయం అంటున్నారు. దేనికి ఇది? అన్నవరం నుంచి రాజమండ్రి మహా అయితే 70 కిలోమీటర్లు. కాకినాడ నుంచి రాజమండ్రి అంతే దూరం. అనకాపల్లి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎంత దూరంలో వుందో, అన్నవరం ఎయిర్ పోర్ట్ అంతే దూరంలో వుంటుంది. ఇటు అటు కాకుండా మరి దేనికోసం? ఎవరి కోసం?

అంటే.. అన్నవరం సమీపంలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మా సెజ్‌, దివీస్ ల్యాబ్, పోర్ట్ ల కోసం కదా? ఇప్పుడు ఈ సంస్థల ప్రతినిధుల కావచ్చు, పెద్దలు కావచ్చు రాజమండ్రి వరకు తమ ప్రయివేట్ జెట్ ల్లో వచ్చి, అక్కడ నుంచి గంటకు పైగా రోడ్ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అదే అన్నవరం దగ్గర ప్రభుత్వ ఖర్చుతో ఎయిర్ పోర్ట్ నిర్మించేస్తే, తమ ప్రయివేట్ జెట్ లతో హ్యాపీగా వాడేసుకోవచ్చు. పేరుకు రోజుకో విమానం నడిస్తే నడుస్తుంది లేదంటే లేదు.

ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది.

అన్నవరం చుట్టుపక్కల పొలాలు సస్యశ్యామలం కావాలని ఎప్పుడో 60ల్లో పంపా రిజర్వాయర్ భారీగా కట్టారు. అలాగే పోలవరం కాలువా కూడా ఇక్కడ దాకా తెచ్చారు. ఇప్పుడు 800 ఎకరాల పొలాలు అన్నవరం ఎయిర్ పోర్ట్ కు పోతే మరి రిజర్వాయర్ ఎందుకు? పోలవరం ఎందుకు?

ఇక్కడ కూడా ఓ కుట్ర వుందని వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సెజ్‌ లు, ల్యాబ్ లు, వీటి చుట్టూ వున్న పొలాలు మాయం చేస్తే నీళ్లన్నీ మిగులు. అప్పుడు అ నీళ్లు అన్నీ హ్యాపీగా ఈ పరిశ్రమలు వాడేసుకోవచ్చు. లేదంటే వారికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి.

అంటే… ఇటు అందుబాటులో తమ ప్రయివేట్ జెట్ లకు ప్రభుత్వ ఖర్చుతో విమానాశ్రయం, అదే సమయంలో వ్యవసాయం లేకుండా చేసి, అ నీళ్లు పరిశ్రమలకు మళ్లించేయడం. ఇవి తప్ప కనుచూపు మేరలో అన్నవరం విమానాశ్రయం వల్ల ఉపయోగం కనిపించడం లేదు.

అన్నట్లు సనాతన ధర్మం అని ఎలుగెత్తే వారు ఇక్కడ ఓ సంగతి గమనించాలి. అన్నవరం అలయానికి కూతవేటు దూరంలో విమానాశ్రయం నిర్మిస్తే, శ్రీసత్యనారాయణ స్వామి విమాన రాజ‌ గోపురం మీద నుంచి విమానాలు ఎగురుతాయి. ఫరవాలేదా మరి?

నిజంగా ఈస్ట్ గోదావరిలో మరో విమానాశ్రయం నిర్మించాలని అనుకుంటే ఎప్పటి నుంచో కావాలని అడుగుతున్న కోనసీమ వాసులకు అందుబాటులో అ ప్రాంతంలో ఇవ్వాలి తప్ప, ఇక్కడ ఎందుకు? ఎందుకంటే పైన చెప్పుకున్న కారణాల వల్లే అనుకోవాలి. పైగా ఇక్కడ అయితే పంట భూములు మాయం అవుతాయి. కానీ అదే కోనసీమ దగ్గర ఉప్పుటేరు భూములు, బంజరు భూములు వున్నాయనే వాదన కూడా ఇక్కడ గమనించాలి. అబ్బే ఇవన్నీ మాకు వద్దు… తెర వెనుక అజెండా వేరు. తెరముందు చెప్పేది వేరు. అంతే.

నిజానికి తెలంగాణ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ ఇలాంటి పెద్ద పట్టణాలు అన్నింటికి ఒక్కటే విమానాశ్రయం..హైదరాబాద్. ఎంత మన అంధ్ర వాడే విమానశాఖ మంత్రి అయినా, దేశం మొత్తానికి మంత్రి కనుక ముందు అటు దృష్టిపెడితే మంచిది కదా?

52 Replies to “అన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!”

  1. ఎంత పెద్ద కుట్ర బట్టబయలు చేసినావు గుద్ధాంద్ర…. నువ్వే కానీ లేకుంటే అడ్డూ అదుపూ లేని కుట్రలతో కూటమి ప్రభుత్వం ఇంకా ఏమేమి చేసేసేదో… జగన్ ని పొగిడి పొగిడి m లో కలిపేశావు… ఇప్పుడు కొత్త కొత్త కూని రాగాలు తీస్తున్నావు…

  2. Vinevaadu verri pushpam ayithe cheppevadu ilantivi anni ayina cheptharu.

    Basic knowledge vundadu vedhavalaki. Airport ante amanna chocolata ??? Janalni maya matalatho buridi kottinchadame kootami nethala mukhya uddesyam.

    1. గతం లో జగన్ రెడ్డి 26 జిల్లాలకు జిల్లాకొక విమానాశ్రయం అన్నాడు.. అప్పుడు నీ యెర్రిపుష్పం ఎక్కడ దొపుకొన్నావు..?

      అప్పుడు అనిపించలేదా జగన్ రెడ్డి మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నాడని..?

      151 నుండి 11 కి పడిపోయినా.. మీ జన్మలకు సిగ్గనేదే లేదు..

      1. నల్లమల లో కూడా ఒకటి వెయ్యండి ఇంకా ఏమన్నా ముక్కలు ఉన్నాయేమో వేరుకోటానికి వెళ్లాలంటే ఈజీ కదా..

      2. @*నల్లమల లో కూడా ఒకటి వెయ్యండి ఇంకా ఏమన్నా ‘#%ముక్కలు ఉన్నాయేమో వేరుకోటానికి వెళ్లాలంటే ఈజీ కదా..

  3. ఇది వరలో సీబీఎన్ హయం లో ఫ్లైట్ దిగితే గన్నవరం లో, ఇంటికి అర గంటె ప్రయాణం, ఆ తరువాత దిగిపోయిన ఎదవ హయం లో మార్పుకి ఫ్లైట్ దిగితే 8 గంటలు ఇంటికి చేరటానికి. ఒక్క విధముగా కాదు ఆ సన్నాసి ఇబ్బంది పెట్టింది.

        1. Court ki vellinstay orders techukunna sannasi ni adugu. Rushikonda medha vesina isuka ralla daggara selfies teesukunna sannasi evadu? Pedalaki Amaravathi lo lands ivvakoodadu ani courts ki vellina sannasi evadu?

          1. Staylu, Bailu, Selfies, Pedalu ane padhalu thappa Jagan ku, ‘abhivrudhi’ ane padham okatundhi ani maripinchadu, aa 420, 11 gaadu. Intha kanna knowledge yem unttundhi le vaadiki? Addankulu yenni unnayi ane lekka Kadhu, gamyam anedhi cherama mukyam. 23 unna CBN ’19 lo 3 rajadhanulu apina monagaadu, 67 unna jaggadu ’14 lo okka rajadhani apaleni pirikodu. Psycho Jagan

          2. .Staylu,Bailu,Selfies,Pedalu ane padhalu thappa Jagan ku, ‘abhivrudhi’ ane padham okatundhi ani maripinchadu, aa 420, 11gaadu. Intha kanna knowledge yem unttundhi le vaadiki?Addankulu yenni unnayi ane lekka Kadhu, gamyam cherama mukyam. 23 unna CBN ’19 lo 3 rajadhanulu apina monagaadu, 67 unna jaggadu ’14 lo okka rajadhani apaleni_pirikodu.Psycho Jagan

  4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహా మేత జిల్లాకో ఎయిర్ పోర్ట్ 

    అన్నప్పుడు ఎక్కడున్నావు గ్యాస్-ఆంద్రా..

    1. నల్లమల లో కూడా ఒకటి వెయ్యండి ఇంకా ఏమన్నా ముక్కలు ఉన్నాయేమో వేరుకోటానికి వెళ్లాలంటే ఈజీ కదా..

    2. @‘నల్లమల లో కూడా ఒకటి వెయ్యండి ఇంకా ఏమన్నా ‘#ముక్కలు ఉన్నాయేమో వేరుకోటానికి వెళ్లాలంటే ఈజీ కదా..

  5. evadu చెప్పాడో కూడా లేకుండా గాలి న్యూస్ బాగానే రాసావు కానీ పాలస్ పప్పు చెప్పిన జిల్లాకో ఇంటర్నేషనల్/ domestic airport ఏమైంది?? వీడు ఇంకా నేనే cm అనే భ్రమలో బ్రతుకుతున్నాడు ప్రజల దగ్గర దోచుకున్న డబ్బు ని charities కి ఇచ్చేసి చివర కోరికగా ఆ project చేయమని అర్జీ పెట్టుకోమని చెప్పు!!

  6. ఇలాంటి లీడర్ ఉన్నపుడు అన్నవరం ఏంటి అనకాపల్లి కి కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది

  7. Airport కి Air strip కి తేడా తెలియని సన్నాసి చేత ariticles రాయంచుకుంటున్నావ్ అంటే నువ్వు ఎంత సన్నాసివో అర్థమవుతుంది.

  8. నల్లమల లో కూడా ఒకటి వెయ్యండి ఇంకా ఏమన్నా ముక్కలు ఉన్నాయేమో వేరుకోటానికి వెళ్లంటే ఈజీ కదా..

    1. vunna airports lone kadapa + kurnool + puttaparthi vimanalu leka eegalu dolukunta vunamu . vunnavatine baaga develop chethe ade padivelu . maha ante kakinada daggara okati vasthe chaalu .. adi kooda 10 to 15 lo

  9. ఇది రాసినవాడికి కొంచెం అయినా ఇంగితం ఉండాలి

    చంద్రబాబుగారు అలా అలా చెప్పుతూనే ఉంటారు. లోగడ నుండీ చెప్పుతున్నదే జిల్లాకో విమానాశ్రయం, తాడేపల్లిగూడెంలో ఒకటి ఒంగోలులో ఒకటి అలా అలా వస్తూనే ఉంటాయి. అదే ఇంకోసారి చెప్పారు. అప్పుడూ ఇప్పుడూ విమానయాన మంత్రి తెలుగుదేశం వారే కదా ! అప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుతుందా ?

    అమరావతిలో ఒలింపిక్స్, ఆ ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకు నోబుల్ ప్రైజూ,

    తిరుపతి (ఆ తర్వాత వదిలేసారు) విశాఖపట్నం విజయవాడకు మెట్రో, విశాఖపట్నం టూ విజయవాడ హైపర్ ల్యూబ్ రైలూ,

    మెడికల్ హబ్బూ, ట్రాన్స్పోట్ హబ్బూ, కాలేజీల హబ్బూ, ప్రపంచంలో మొదటి అయిదునగరాల్లో ఒకటిగా అమరావతి.

    అలా వారు వదిలినవన్నీ సీరియస్ గా తీసుకుంటే పిచ్చెక్కిపోతుంది.

  10. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కో ఊర్లో 2-3 airports ఉంటాయి.

    మెల్లగా ఇంటర్నేషనల్ airport అధికంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ కి వాడి, డోమెస్టిక్ ట్రావెల్ కి చిన్న ఎయిర్పోర్ట్ వాడతారు. ఇదంతా జరిగేసరికి నువ్వు వుండవు కానీ బయట చూసి నేర్చుకో లోక జ్ఞానం

Comments are closed.