కొన్ని ఏడుపులకు అర్థాలు వుండవు. ఏడ్చే వాళ్లు ఏడుస్తూనే వుంటారు. తెలుగుదేశం అనుకుల జనాల ఏడుపు ఇలాగే వుంటుందేమో? సాధారణంగా ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు వస్తే కొద్ది సేపు ట్రాఫిక్ ఆపడం మామూలే. కానీ జగన్ వస్తుంటే మాత్రం అసాధారణంగా వుంటోంది. పరదాలు కట్టేస్తున్నారు. కొందరిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. సిఎమ్ కాకముందు జనాల్లో తిరిగి ముద్దులు పెట్టారు. ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు అంటూ ఒకటే గోల.
పాదయాత్ర చేసి జనాల్లో తిరిగినపుడు జగన్ ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. అతన్ని ఎలాగైనా అధికారంలోకి రానివ్వకూడదని తెలుగుదేశం పార్టీ అనుకుల మీడియా ఎంత చేయాలో అంతా చేసింది. అయినా జనం జగన్ ను గెలిపించి సిఎమ్ ను చేసారు.
ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమిటి?
కొన్ని పదుల మంది నాయకులకు కొరకరాని కొయ్య.
కొన్ని పదుల మంది దోపిడిదారులకు లొంగని మనిషి.
లక్షల్లోనో, కోట్లలోనో వున్న ఓ సామాజిక వర్గానికి నిద్రపట్టకుండా చేస్తున్నాడు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటో, తమ పార్టీ పరిస్థితి ఏమిటో అని తలలు బద్దలు కొంటుకుంటున్నవారు వందలు, వేల సంఖ్యలో వున్నారు.
అన్నింటికి మించి కోట్లకు కోట్లు గణించి మిలియన్లకు పడగలెత్తిన అనేక మందికి జగన్ బద్ద శతృవు. జగన్ ను మరోసారి అధికారంలోకి రాకుండా ఎలా చేయడం అన్నదే వీరి నిత్య ఆలోచన.
ఇలాంటపుడు జగన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి?
ఏ జాగ్రత్తలు తీసుకోకుండా, అందరినీ నమ్మేసి, అజాగ్రత్తగా బయటకు వచ్చేసి, వైఎస్ మాదిరిగా మాయమైపోవాలని వీరంతా కోరుకుంటున్నారా? అందుకే రివర్స్ గేర్ లో ఇలాంటి రాతలు రాస్తున్నారా? మళ్లీ వీళ్లే రాస్తారు. అమెరికా అధ్యక్షుడు వస్తే భద్రత ఎలా వుంటుంది? ఏ రేంజ్ లో వుంటుంది? ఎంత మంది పని చేస్తారు? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది పేజీలకు పేజీలు కథనాలు వండి వారుస్తారు.
అమెరికా అధ్యక్షుడి ప్రాణం అయితే ఒకటీ, మన సిఎమ్ ప్రాణం అయితే వేరునా? ఇప్పుడు వీళ్ల వార్తలు చూసి, జగన్ తన భద్రతను గాలికి వదిలేస్తే వీళ్లకు ఆనందమా? ఆ ఆనందం వెనుక ఆలోచనలు ఏమై వుంటాయి? ఇలాంటి వార్తలు రాయడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుంది? వైఎస్ మాదిరిగా జగన్ కూడా మాయమైపోయి, తమ సామాజిక సామ్రాజ్య విస్తరణకు, తమ ధన దాహానికి, తమ అధికార అధిరోహణకు, తమ వ్యాపార సానుకూలతకు అడ్డంగా వున్న పెద్ద మేరు పర్వతం అడ్డు ఈ విధంగా తొలగిపోవాలనుకుంటున్నారా?
జనాలు ఇవన్నీ పసిగట్టలేని పిచ్చోళ్లనుకుంటే అది అసలైన పిచ్చితనం అవుతుంది.