అన్నాను…అంటాను… మళ్ళీ మళ్ళీ అంటాను… !

అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఉండాలని రైతుల పేరుతో అమరావతి నుండి అరసవెల్లికి మహాపాదయాత్ర చేస్తున్నా వారిపై నిన్న ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి అంబ‌టి రాంబాబు సంచాల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో తీవ్ర దూమ‌రం రేగాయి. ఇవాళ…

అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఉండాలని రైతుల పేరుతో అమరావతి నుండి అరసవెల్లికి మహాపాదయాత్ర చేస్తున్నా వారిపై నిన్న ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి అంబ‌టి రాంబాబు సంచాల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో తీవ్ర దూమ‌రం రేగాయి. ఇవాళ ట్వీట‌ర్ వేదిక‌గా కూడా మంత్రి త‌న మాట‌ల‌ను స‌మ‌ర్ధించుకున్నారు.

అమ‌రావ‌తి ఏకైకా రాజ‌ధాని మాత్ర‌మే అజెండాగా పాద‌యాత్ర చేసే వారంత వొళ్ళు బ‌లిసినోళ్లని నిన్న అన్న మాట‌లకు క‌ట్టుబ‌డి ఉన్నానంటూనే అన్నాను.. అంటాను.. మ‌ళ్ళీ మ‌ళ్ళీ అంటాను.. అది వొళ్ళుబ‌లిసి నోళ్ల పాద‌యాత్ర‌! అని ట్వీట‌ర్ ద్వారా పునర్ఘటించారు. పాద‌యాత్ర‌లో విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.

పాద‌యాత్ర పేరుతో టీడీపీ నాయ‌కులు చెప్పులు చూపిస్తూ, తొడలు కొడుతూ, బూతులు తిట్టుకుంటూ సాగుతున్న యాత్ర‌కు ప్ర‌జ‌ల నుండి స్పంద‌న రాక‌పోయిన వైసీపీ నాయ‌కులు వారిపై విమ‌ర్శ‌లు చేస్తు వారికి మైలేజ్ తెస్తున్న‌రంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. యాత్ర 60 రోజులు చేసిన సంవ‌త్స‌రం చేసిన రాష్ట్ర ప్ర‌జ‌లు అమ‌రావ‌తి ఒక‌టే అభివృధి చేస్తామంటే ఎందుకు న‌మ్ముతారంటూన్నారు వైసీపీ నేత‌లు.

టీడీపీ నేత‌లు, అమ‌రావ‌తి పాద‌యాత్ర పేరుతో యాత్రలో ఉన్న సామాజిక నేత‌లు వైసీపీ నేత‌ల‌పై తొడ‌లు కొట్టే బ‌దులుగా అమ‌రావ‌తి ఒకటే అభివృధి చేందితే రాష్ట్రం అంత ఏలా అభివృధి అవుతుంద‌నేది చెప్పితే క‌నీసం అమ‌రావ‌తి ప‌ట్ల క‌నీసం సానుభూతి వ‌స్తుందంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అమ‌రావ‌తి అనేది భ్ర‌మ‌రావ‌తి అనే కల్పనా పోవాలంటే తొడ‌లు కొట్టే దానిపై ఉన్న శ్ర‌ద్ధ ఇత‌ర ప్రాంతాలు ఎలా అభివృధి చెందుతాయో వివ‌రిస్తే మంచిది కాదా.