జగన్ చేసిన, చేస్తున్న అతి పెద్ద తప్పు

కుంజరయోధంబు..దోమ కుత్తుక జొచ్చెన్… అన్నది ఎప్పుడో జమానా కాలంలో ఓ అవధాని గారికి ఎదురైన పిచ్చి ప్రశ్న. ఏనుగు వెళ్లి దోమ గొంతులో దూరిందని కవి భావం. Advertisement జగన్ కోరి పిలిచి దర్శకుడు…

కుంజరయోధంబు..దోమ కుత్తుక జొచ్చెన్… అన్నది ఎప్పుడో జమానా కాలంలో ఓ అవధాని గారికి ఎదురైన పిచ్చి ప్రశ్న. ఏనుగు వెళ్లి దోమ గొంతులో దూరిందని కవి భావం.

జగన్ కోరి పిలిచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను కలవడం అనగానే ఇదే గుర్తుకు వచ్చింది. కెరీర్ చరమాంకంలో ఎవరికీ పట్టని, ఎవరూ పట్టించుకోని సినిమాలు తీస్తూ, తన బతుకు తెరువు చూసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ను అర్జెంట్ గా పిలిచి, అరగంట మాట్లాడి, మళ్లీ ఆక్సిజన్ అందించారు ఆంధ్ర సిఎమ్ జగన్.

ఇటీవల కాలంలో జగన్ చేసిన, చేస్తున్న పెద్ద తప్పు ఏదైనా వుందీ అంటే ఇదే అనుకోవాలి. సదా పబ్లిసిటీ తిని, తాగి బతికే ఆర్జీవీ తాను జగన్ ను కలవగడం కూడా హడావుడి చేసుకున్నారు. ఇంకా ఆర్జీవి దగ్గర తడి వుందని భ్రమించే వాళ్లు సినిమా రంగంలో అయితే లేరు. కొండా సురేఖ ఫ్యామిలీ నమ్మారు. సినిమా తీసారు. డబ్బులు కాల్చుకున్నారు. ఫలితం శూన్యం.

ఇప్పుడు మిధున్ రెడ్డినో మరొకరు నో ఇదే చేసినా ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. కానీ ఈ లోగా జగన్ కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. ఎన్నికలు వస్తుంటే మరేం చేయడం చాతకాక ఆర్జీవీ తో సినిమా తీయించుకుంటున్నారని, పవన్ అంటే భయపడిపోయి, ఆర్జీవీతో సినిమా తీయిస్తున్నారని ఇలా రకరకాల హడావుడి సోషల్ మీడియాలో. దీంతో ఆర్జీవీ ఇమేజ్ అప్ అయింది ఏమీ లేదు కానీ, జగన్ ఇమేజ్ కాస్తయినా డౌన్ అయిందన్నది వాస్తవం.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆర్జీవీ ఇలా ప్రకటించి అలా ఆపేసిన సినిమాలు అనేకం వున్నాయి. పైగా జగన్ ను కలిసారు తప్ప సినిమా ప్రకటించలేదు. అందువల్ల మిధున్ రెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు. ఇలాంటి వ్యవహారాలకు ఎంత దూరం వుంటే అంత మంచిది..