cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Analysis

జగన్ గేమ్ ప్లాన్ అదేనా?

జగన్ గేమ్ ప్లాన్ అదేనా?

మహానాడు సక్సెస్ కావడం అన్నది కీలకం. అది ఎలా సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది అన్నది అనవసరం. ఆ సక్సెస్ తో తెలుగునాట ప్రతిపక్ష రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేసాయి. తమ బలం పెరిగిందని అనుకుంటున్న తెలుగుదేశం వైపు నుంచి జనసేనతో పొత్తు అవసరం లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 

ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుందన్న భయంతో అధిష్టానం తమ నాయకులను కాస్త కంట్రోల్ చేసింది. కానీ కాస్త డ్యామేజ్ కావడం జరిగింది. జనసేన వైపు నుంచి కూడా కౌంటర్ అటాక్ లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ టోన్ లో మార్పు వచ్చింది. అంతే కాదు. దసరా నుంచి పవన్ కళ్యాణ్ రోడ్ మీదకు వస్తున్నారు. చంద్రబాబు ఆల్రెడీ రోడ్ మీదకు వచ్చేసారు.

ఇవన్నీ ఎందుకు జరిగాయి? జరుగుతున్నాయి? అంటే 2023లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఆలోచతో. ఇది కూడా ఎవరు ముందుగా మాట్లాడింది అంటే చంద్రబాబు నాయుడే. ఆయన ఏ ఆలోచనతో  లేదా ఏ సమాచారంతో ఈ విధంగా చేసారన్నది తెలియదు. కానీ ఈ గేమ్ ప్లాన్ అంతా జగన్ దే అని వినిపిస్తోంది. ఎందుకంటే అందరికన్నా ముందుగా పార్టీ సమావేశాలు, ఎమ్మెల్యేల సమావేశాలు జరిపి, ఎన్నికలకు సిద్దంగా వుండండి..అంటూ పిలుపు ఇచ్చింది జగన్ నే. ఆ తరువాతే ఈ గడబిడ అంతా ఫ్రారంభమైంది.

2024 వరకు జగన్ ఎన్నికలకు వెళ్లేది లేదు అన్నది వైకాపా కీలక నాయకుల సమాచారం. పైగా కేంద్ర ఎన్నికలు కూడా 2024లోనే. ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ రెండూ ఒకసారి జరిగితేనే మంచిది అని కేంద్రం అలాగే పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుందన్నది వారి ఆలోచన.

ఆ సంగతి అలా వుంచితే జగన్ ఆలోచన కూడా అదే ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు రెండూ ఒకసారి జరిగితే పార్టీ మీద ఆర్ధిక భారం తగ్గుతుంది. పైగా నాలుగేళ్ల తరువాత ఇంకా ఒక ఏడాది పదవీ యోగం ఎందుకు వదులుకోవాలి? ఏ రాజకీయ నాయకుడైనా? మరి జగన్ గేమ్ ప్లాన్ ఏమిటి? ఇప్పుడు ప్రతిపక్షం అంతా రోడ్డెక్కుతుంది. ప్రభుత్వం మీద ఎన్ని రకాల విమర్శలు చేయాలో అన్నీ చేసేస్తారు.

ఆ టూర్లు, ఆ కార్యక్రమాలు అన్నీ అయ్యాక జగన్ వారు చేసే వాటిని అన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ ప్రకారం సెట్ చేసుకునే పనిలో పడతారు. ఉదాహరణకు రోడ్లు. ప్రతిపక్షాలు రోడ్ల మీద నానా యాగీ చేసాయి. ఇప్పుడు దాదాపు సగానికి సగం మరమ్మతు అయిపోయాయి. ఇప్పుడు మిగిలినవి కూడా రిపేర్ చేసేస్తే, ఇక ఆ విమర్శ ఇన్ వాలిడ్ అయిపోతుంది. ఇది ఒక ఆలోచన.

ప్రతిపక్షాలు ఎన్నిసార్లు మాట్లాడినే అవే విమర్శలు తప్ప కొత్తవి పుట్టుకురావు. ఇలాంటివి విని. విని. జనం విసిగిపోతారు. రాజశేఖర్ రెడ్డి టైమ్ లో అదే జరిగింది. రెండు సార్లు జరిగిన ఎన్నికలకు ఒకటే తరహా స్టోరీలు రెండు దినపత్రికల్లో విపరీతంగా వండి వార్చారు. కావాలంటే ఆర్కైవ్స్ లోకి వెళ్లి పాత పత్రికలు తిరగేయచ్చు. లక్షకోట్లు, స్కాములు, అవినీతి అంటూ, దాంతో జనం విని విని, చదివి చదివి విసిగి పక్కన పెట్టారు. సంక్షేమమే ముద్దు అన్నారు.

ఇక్కడ ఇప్పుడు సమస్య ఏమిటి? సంక్షేమాన్ని విమర్శించడానికి లేదు. అందుకే సంక్షేమానికి మూలమైన నిధులు, అప్పుల మీద దృష్టి పెట్టారు. జగన్ ఒకటే అంటాడు రేపు ఎన్నికలకు వెళ్లినపుడు. నేను ఎలాగో అలా తెచ్చి మీకు డబ్బులు ఇస్తున్నా..వీళ్లు వద్దు అంటారు అని కారణం వాళ్ల మీదకు నెడతాడు. ఇంతకీ ప్రతిపక్షాలు తమ మేని ఫెస్టోలో తాను ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ వుంటాయా? వుండవా? క్లారిటీ అడగమని చెబుతాడు. 

అందుకే ప్రతిపక్షాలు ఇది ఊహించే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది.. ధోగతి అయిపోయింది అని బాకా ఊదడం ప్రారంభించాయి. కానీ జనాలు ఏమని ఆలోచిస్తారు? ఏం అధోగతి అయింది? ఏం అల్ల కల్లోలం అయింది? అయిదేళ్ల క్రిందట ఎలా వుందో ..ఇప్పుడూ అలాగే వుంది కదా? అని. ఎవరైతే పథకాలు అందుకోరో వాళ్లకి మాత్రం ఇవి కచ్చితంగా ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఆ ఓట్లు ప్రతిపక్షాలకు పడొచ్చు.

సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఆర్నెల్లు తిరిగి చేసిన విమర్శలు అన్నీ మళ్లీ 2024లో అవే చేయాల్సి వుంటుంది. ఇప్పుడు కలిగించినంత ప్రభావం ఇక అప్పుడు కలిగించవు. ఎప్పుడూ ఇదే విమర్శలు అనిపిస్తాయి. అదే జగన్ గేమ్ ప్లాన్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలను తమ బలాలు కూడదీసుకునేలా చేసింది. రోడ్డెక్కేలా చేసింది. నాయకులు, కింది స్థాయి నాయకుల మధ్య గడబిడకు దారి తీసింది. 

ఇప్పుడు జగన్ సైలంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతారు. సరిగ్గా 2024 వచ్చేక ఆయన రోడ్డెక్కుతారు. ఈ లోగా ప్రతిపక్షాల విమర్శలు అన్నీ తిప్పి కొట్టేలా, అవన్నీ పనికి రాకుండా పోయేలా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతారు. అప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి