…’’నిజానికి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయన చాలా కష్టపడాలి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా ఉంటే కుదరదు. జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముందుగా ఈ అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం జరగాలి.
చివరిగా జనసేనానిగానీ, జనసైనికులుగానీ ఆచితూచి అడుగులు వేయడం అలవర్చుకోవాలి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సింది ఒక్కటే! ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావడమా? లేక జగన్‌ను ఇంటికి పంపడమా? తన ప్రాధాన్యత ఏమిటో తను తెలుసుకోవాలి. అదే సమయంలో ‘డబ్బులు ఎవరికీ ఊరకే రావు’ అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి అంటే అంత తేలిక కాదని కూడా జనసేనాని గుర్తించాలి. ..’’
చరిత్రలో కాపులకు ముఖ్యమంత్రి పదవి అంతలేదు. ఒక్క శాతం, రెండు శాతం, మూడు శాతం ఇలా తక్కువ శాతం జనాభా వున్నవారిని కూడా ముఖ్యమంత్రి పదవి వరించింది. కానీ కాపు నాయకులు ఎవరైనా పార్టీ పెడితే చాలు కాపు పార్టీ గా ముద్రవేసేయడం.
ఈవారం కాలమ్ లో జర్నిలిస్ట్ ఆర్కే కూడా అదే ప్రయత్నం చేసారు. ముద్ర వేసింది ఎవరు? ప్రజా రాజ్యం మీద అయినా, జనసేన మీద అయినా. ఓ వర్గం మీడియానే కదా?
అది సరే పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా తన తక్షణ కర్తవ్యం డిసైడ్ చేసుకోవాలంట. జగన్ ను గద్దె దింపడమా? తను సిఎమ్ కావడమా? అన్నది తేల్చాలంట..అవును ఇక్కడ ఓ లాజిక్ వుంది కదా, జగన్ ను గద్దె దింపితే పవన్ సిఎమ్ కారా? కావచ్చు కదా?
మరో యాంగిల్ లో చూస్తే, కులపార్టీ అనే ముద్ర తెలుగుదేశానికి లేదా? అసలు చంద్రబాబే ముందుగా జగన్ ను గద్దె దించడమా? మళ్లీ ముఖ్యమంత్రి కావడమా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు కదా? జగన్ వల్ల రాష్ట్రం అంత అన్యాయం అయిపోతుంటే చంద్రబాబు పదవి కన్నా రాష్ట్రం ముఖ్యం అని అనుకోవచ్చు కదా? అంతా పవన్ దే బాధ్యతనా?
సరే పవన్ పార్టీ కుల పార్టీ అయితే దాంతో అంటకాగాలనే ప్రయత్నం చంద్రబాబుకు ఎందుకు? కుల పార్టీ నాయకుడు అనే ముద్ర వుంటే పవన్ మాట ప్రజలు వింటారా? వింటారని ఎలా అనుకుంటున్నారు? అంటే పవన్ అర్జెంట్ గా సిఎమ్ పదవి మీద కోరిక వదిలేసుకోవాలి.
జగన్ ను దింపేయాలి. అప్పుడు చంద్రబాబు పవర్ లోకి వస్తారు. అప్పుడు పవన్ పార్టీ ఏమవుతుంది? ఇంకేం పని మిగిలి వుంటుంది? జగన్ ను దింపేయమంటారు. జనం దింపేస్తారు అనుకుందాం. మళ్లీ చంద్రబాబును దింపేయమని పిలుపు ఇస్తారా? అలా ఇస్తే ఈ మీడియా ఊరుకుంటుందా?
పవన్ కు సత్యం బోధపడేలా చేయదూ? మరి చంద్రబాబు, తెలుగుదేశం నే అధికారంలో కంటిన్యూ అయితే పవన్ ఇక రాజకీయాలతో ఏం పని? ఈపాటి చిన్న లాజిక్ పవన్ కు తెలియదంటారా?