ఇదే జనసేన విధానమా? ఆంధ్రలో కూడా

జనసేన కొత్త తరం రాజకీయాలు ప్రోత్సహిస్తుందని పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. కానీ చేతలు వేరుగా వుంటాయి.  Advertisement పార్టీ తమదని భావించే యువత, ఫ్యాన్స్, కాపు సామాజక వర్గ జనాలను…

జనసేన కొత్త తరం రాజకీయాలు ప్రోత్సహిస్తుందని పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. కానీ చేతలు వేరుగా వుంటాయి. 

పార్టీ తమదని భావించే యువత, ఫ్యాన్స్, కాపు సామాజక వర్గ జనాలను కేవలం జెండా మోత కోసం వాడుకుంటారు. టికెట్ లు మాత్రం జంప్ జిలానీలకు ఇస్తుంటారు. 

గత ఎన్నికల్లోనే తాను సదా విమర్శించే గంటా శ్రీనివాసరావు బంధువును పార్టీలోకి తెచ్చి టికెట్ ఇచ్చిన వైనం వుండనే వుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రలో తేదేపా జనాలను పార్టీలోకి తెచ్చి, ఓ ప్లాన్ ప్రకారం టికెట్ లు ఇస్తారనే ప్రచారం వినిపిస్తూనే వుంది.

తెలంగాణ ఎన్నికల్లో మాత్రం దీనికి క్లారిటీ వచ్చేసింది. టికెట్‌లు ప్రకటించడానికి రెండు రోజులు పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి, టికెట్ లు ఇవ్వడం అంటే ఏమనుకోవాలి. అది కూడా ఒకరు ఇద్దరు కాదు, ముగ్గురికి అలా టికెట్ లు ఇచ్చారు. 

కూకట్ పల్లిని నమ్ముకున్న శంకర్ గౌడ్ ను తాండూర్‌కు పంపించి, కూకట్ పల్లి టికెట్ ను ‘అస్మదీయులకు’ ఇవ్వడం అంటే పవన్ టికెట్ ల కేటాయింపు ఎలా వుంటుందో క్లారిటీ వచ్చేసినట్లే.

ఆంధ్రలో కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ వుండదు. వుండబోదు. కానీ ఒక్కటే. ఎనిమిది టికెట్‌లు కనుక తెలంగాణలో గొంతులు లేవలేదు. కానీ ఆంధ్రలో అలా వుండదు. అక్కడ ఆశ పెట్టుకున్నవారు, పార్టీ తమదే అనుకుంటున్నవారు చాలా మంది వున్నారు. ఇలా తేడా చేస్తే అక్కడ అంత సింపుల్ గా వుండదు. రచ్చ రచ్చగా వుంటుంది.