Advertisement

Advertisement


Home > Politics - Analysis

కాపుల పరువు తీసిన పవన్?

కాపుల పరువు తీసిన పవన్?

రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదు అనే భావమే వస్తుంది. ఇలా వుండాలి అని చెప్పడం అంటే అలా వుండడం లేదు అనే భావమే వస్తుంది. కాపుల సభ లో పవన్ కళ్యాణ్ కాపులకు చేసిన హిత బోధ ఏమిటి?

‘మీరు కొంచెం మృదువుగా మాట్లాడడం నేర్చుకోండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నన్ను ఇక్కడ పోటీ చేయండి..అక్కడ పోటీ చేయండి…అంటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడించారు. కాపులు ఓట్ల వేసి వుంటే కచ్చితంగా గెలిచేవాడిని. నేను ఓడిపోతే కేరింతలు కొట్టింది కాపులే. కాపుల్లో ఐక్యత లేదు.

రంగా చనిపోతే లక్షల మంది వచ్చారు. అదే కనుక బతికి వున్నపుడు నిరశన శిబిరం దగ్గర ఊరికి వంద మంది వంతున మద్దతుగా కూర్చుని వుంటే ఆయనపై దాడి జరిగి వుండేది కాదు. మంది ఎక్కువ మంది వుంటే ఐక్యత వుండదు అన్నది నిజమే

డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి..డబ్బులు తీసుకోకుండా వుండలేకపోతే తీసేసుకుని, వైకాపా కు మాత్రం వేయకండి’’

ఇలా సాగింది పవన్ ప్రసంగం.

అంటే పవన్ చెప్పినది ఏమిటి? చెప్పాలనుకున్నది ఏమిటి?

కాపుల్లో ఐక్యత లేదు. కాపులను తనకు ఓటు వేయలేదు.

కాపులకు నోరు మంచిది కాదు.

కాపులకు ఇతర కులాలకు పడదు.

కాపులే రంగాను రక్షించుకోలేకపోయారు.

కాపులు ఓటుకు డబ్బులు తీసుకోకుండా వుండలేరు.

అన్నింటికి మించి కాపులు పొరపాటున కూడా వైకాపాకు ఓటు వేయకూడదు. ఎవరైనా జనసేనకు ఓటు వేయమని చెబుతారు. వైకాపాకు వేయద్దు అంటే జనసేనకు వేయమనా? లేక జనసేన వుండదు..తేదేపా వుంటుంది దానికి వేయమనా? అంటే జనసేన వుంటుందనే కచ్చితమైన నమ్మకం పవన్ కు లేదా. అలా వుండి వుంటే వైకాపాకు వద్దు అనే బదులు కాపులంతా జనసేనకే వేయాలని చెప్పేవారు కదా? అలా ఎందుకు చెప్పలేదు?

పైగా కాపులు తగ్గాలి. మిగిలిన కులాలను కలుపుకుపోవాలి. కాపులు నెమ్మదిగా వుండాలి అని చెప్పడం అంటే కాపులను పవన్ ఏ దిశగా నడిపించాలనుకుంటున్నట్లు? అలా చేస్తే రాజ్యాధికారం వస్తుందంటారు. సరే, మరి బిసి, ఎస్సీ లకు రాజ్యాధికారం లేదు అని కూడా అంటున్నారు పవన్. మరి వారి సంగతేమిటి?

దానా దీనా చూస్తుంటే పవన్ కాపులను బుజ్జగించి, బిసి, ఎస్సీలతో సహా తేదేపా దిశగా నడిపించాలనుకుంటున్నట్లుంది. అదే పవన్ సోషల్ ఇంజనీరింగ్ అనుకోవాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?