Advertisement

Advertisement


Home > Politics - Analysis

కౌలు రైతులపై అధ్యయనం అవసరం

కౌలు రైతులపై అధ్యయనం అవసరం

కౌలు రైతుల ఆత్మహత్యలు అన్నది జనసేన లేవనెత్తుతున్న బర్నింగ్ టాపిక్. ఏడాదికి మూడు పంటలు పండే, సమృద్దిగా నీటి వనరులు వున్న గోదావరి జిల్లాలో కూడా కౌలు రైతుల ఆత్మహత్యలు అంటే కచ్చితంగా ఆలోంచించాల్సిన విషయమే. 

నిన్నటికి నిన్న తూర్పు గోదావరిలో పవన్ మాట్లాడుతూ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం భీమా పరిహారం ఇవ్వడం లేదని, అడిగితే కౌలు కార్డు చూపించమంటున్నారని అన్నారు.

ప్రభుత్వం ఏం సహాయం చేయాలన్నా దానికి ఓ విధి విధానం వుంటుంది. వుండాలి కూడా. లేదూ అంటే ఇక విచ్చలవిడిగా ఇచ్చుకుంటూ పోవడం తప్ప మరోటి వుండదు. కౌలు కార్డు విధానం అన్నది ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. భూమి యజమాని నుంచి కౌలు రైతు ధృవపత్రం తీసుకుని అందిస్తే కౌలు కార్డు మంజూరు అవుతుంది. ఇది సిస్టమ్. కానీ కౌలు కార్డులు వుండడం లేదు. ఎందుకు?

ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి భూమి యజమానుల్లో నూటికి తొంభై శాతం మంది స్వంతంగా సాగు చేయడం లేదు. ఎక్కడో పట్టణాల్లో వుంటూ, వ్యవసాయం వదిలేసిన వారే ఎక్కువ. వారు కౌలుకు ఇవ్వక తప్పదు. కానీ అలా అని కౌలుకు ఇవ్వడం అన్నది అధికారికంగా అంటే వెనుకాడుతున్నారు. 

కోట్ల విలువైన భూములు లిటిగేషన్ లోకి వెళ్తే ఇబ్బంది. ఏ ఆధారం లేకుండానే కోర్టు మెట్లు ఎక్కే జనాలు పెరిగిపోయారు. ఇక కౌలు పత్రం రాసి ఇస్తే ఏమవుతుందో అన్న భయం. అనుమానం. అందుకే కౌలుకు తీసుకుంటే తీసుకో..అంతే తప్ప ధృవపత్రం అడగొద్దు అనే వారే ఎక్కువ.

ఇప్పటికీ పంటలకు విత్తనాలు, ఎరువులు అన్నీ భూ యజమాని పేరు మీదే ప్రభుత్వం ఇస్తోంది. సాగు చేసేది కౌలు రైతు అయినా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలంటే భూమి పాస్ బుక్ వుండాల్సిందే. అందువల్ల కౌలు రైతు ను మరో విధంగా గుర్తించే అవకాశం ఏదైనా వుండాలి.

ఈ సమస్యకు మరో విధమైన పరిష్కారం చూడాల్సి వుంది. రేపు జనసేనే అధికారంలోకి వచ్చినా ఇప్పడు వున్న సిస్టమ్ ద్వారా కౌలు రైతులను గుర్తించడం అన్నది కష్టం. అలా అని అందరికీ సాయం అందించడమూ కష్టమే. 

అందువల్ల జనసేన ముందుగా చేయాల్సింది ఇటు భూ యజమానికీ, అటు కౌలు రైతు గుర్తింపునకూ, ఉభయత్రా ఆమోదయోగ్యమైన మార్గం..ఉపాయం. అలా కాకుండా కేవలం బురద జల్లుడు రాజకీయం వల్ల ఓట్లు రాలతాయేమో కానీ కౌలు రైతు బతుకు బాగుపడదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?