మళ్లీ పవన్ మౌనవ్రతం

వారాహి యాత్రను జనసేన అధిపతి స్టార్ట్ చేసిన తరువాత కృష్ణా జిల్లాలో జరిగినంత నీరసంగా, నిస్సారంగా మరేదీ జరగలేదు. జస్ట్ రెండు పబ్లిక్ మీటింగ్ లు, రెండు పార్టీ మీటింగ్ లు అన్నట్లుగా సరిపెట్టేసారు…

వారాహి యాత్రను జనసేన అధిపతి స్టార్ట్ చేసిన తరువాత కృష్ణా జిల్లాలో జరిగినంత నీరసంగా, నిస్సారంగా మరేదీ జరగలేదు. జస్ట్ రెండు పబ్లిక్ మీటింగ్ లు, రెండు పార్టీ మీటింగ్ లు అన్నట్లుగా సరిపెట్టేసారు మొత్తం కృష్ణ జిల్లాకు. అదే తనకు పట్టుందని భావిస్తున్న ఈస్ట్ లో అయితే చిన్న..పెద్ద ప్రతి ఊరిలో ఓ మీటింగ్. కానీ కృష్ణ జిల్లాలో ఎందుకిలా?

కృష్ణాజిల్లా తొలి మీటింగ్ లోనే నిస్సారమైన ప్రసంగం ఇచ్చారు పవన్. దానికి అంతా పెదవి విరిచారు. తరువాత మరోసారి మాట్లాడినపుడు కూడా పెద్దగా మార్పేమీ లేదు. భాజపాతో వున్నానని, లేనని, వుంటే మీకేంటీ.. లేకుంటే మీకేంటీ అంటూ తడబాటు ప్రసంగాలు చేసారు. అంతటితో ఆగలేదు. పదేళ్లపాటు తెలుగుదేశం నే అధికారంలో వుంటుందని, పదేళ్ల పాటు అవకాశం ఇచ్చి తీరాలని, పదేళ్ల పాటు పొత్తు కచ్చితంగా వుంటుందని ప్రకటించారు. ఇది జనసేన అభిమానుల్లోకి గట్టిగా వెళ్లింది. దాంతో నిరాశ మొదలయింది.

మరోపక్కన తెలుగుదేశం జనాలను కూడా పవన్ తన స్పీచ్ లతోస సంతృప్తి పరచలేకపోయారు. తెలుగుదేశం వీక్ అయిపోయింది. నీరసపడింది.. ఇబ్బందిపడుతోంది. జనసేన బలంగా వుంది. పోరాట పటిమతో వుంది..అందువల్ల తెలుగుదేశాన్ని ఆదుకోవాలి అనే విధంగా ప్రసంగించారు. ఇది తెలుగుదేశం పార్టీ జనాలకు ఇబ్బంది కలిగించింది.

దీంతో మరేం జరిగిందో, మరేం ఆదేశాలు.. ఎక్కడి నుంచి వచ్చాయో, వారాహి యాత్ర కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎప్పటిలాగే ప్రస్తుతం ఎక్కడున్నారో అన్నది తెలియకుండా పవన్ గూట్లోకి చేరిపోయారు. తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. మరి దానికి అనుగుణంగా ఆయన స్పందించాల్సి వుంది. కానీ అదీ లేదు.

తెలంగాణలో తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తే పొత్తు వున్న భాజపాతో సమస్య. కాదని భాజపా వైపు వస్తే భారాస ఓ లెక్కలో పవన్ ను ఆడుకుంటుంది. అందుకే ప్రస్తుతానికి పవన్ కు , ఆయన పార్టీకి మౌనమే శరణ్యమైంది.