దేశంలోని అత్యధిక సంపన్నుల్లో తెలుగువారు 105 మంది వున్నారు. వారిలో 87 మంది హైదరాబాద్ లోనే వుంటున్నారు. తెలుగువారిలో టాప్ ఫైవ్ ధనవంతుల్లో నలుగురు రెడ్లే. టాప్ లో వున్నది మాత్రం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ధనవంతుల్లో ఎక్కువ మందిది ఫార్మారంగ నేపథ్యమే.
అంటే సినిమా, మీడియా, రాజకీయాలు కన్నా ఫార్మా రంగమే మిన్న అన్న మాట. మనిషి ఆరోగ్యానికి ఎంతయినా ఖర్చు చేస్తాడు. అందుకే ఫార్మా రంగం దిన దిన అభివృద్ది చెందుతోంది.
దివీస్, హెటిరో, అపోలో, రెడ్డి ల్యాబ్స్, అరబిందో ఇవన్నీ, సంపన్నుల జాబితాలో ఫైన వున్నవారివే. అంటే జనాల జబ్బులే వాళ్ల డబ్బులు అన్నమాట. టాప్ ఫైవ్ లో మిగిలినది ఇన్ ఫ్రా రంగానికి చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ. టాప్ 20 తీసుకున్నా కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, కెమికల్స్, హాస్పిటల్స్ ఇవి వున్నవారిదే పై చేయి. ఆపైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగం. ఎంటర్ టైన్ మెంట్, మీడియా లాంటి రంగాలు కలికంలోకి కూడా లేవు
వేల ఎకరాల స్టూడియో, దాదాపు యభై వరకు స్వంత భవనాలు, ఈనాడు గ్రూపు, ఈటీవీ గ్రూపు, మార్గదర్శి గ్రూపు వున్నా కూడా రామోజీ లాంటి వారి పేరు కనిపించలేదు. లీస్ట్ లో లీస్ట్ అంటే అయిదు వేల కోట్ల వ్యక్తిగత ఆస్తి వున్న వారి పేర్లే ప్రకటించారు. అంటే మన బడా రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, ఇంకా నిత్యం వార్తల్లో కనిపిస్తూ, కుబేరులు, సంపన్నులు అని మనం అనుకునేవారు ఎవరూ అయిదు వేల కోట్లకు కూడా ఎగబాకలేదా?
ఏమిటో ఈ లెక్కలు. సామాన్యులకు అర్థం కావు. మినిమమ్ డిగ్రీ, పిహెచ్ డి చేసి వుండాలేమో?