నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు. ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అన్నదట. తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ వ్యవహారం అలా వుంది. ఈ దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసారు. ఆయనకు వున్న రాజకీయ పరిజ్ఙానం ఎన్ని ఏళ్ల వెనక్కు వుంది? మహా అయితే చంద్రబాబు పాలన, కొంచెం ఎన్టీఆర్ పాలన. అంతకు మించి ఏం తెలుసు?
ఇందిర తీసుకువచ్చిన సంస్కరణలు తెలుసా? బ్యాంకులు పేదవాడికి ఉపయోగపడాలని జాతీయ కరణం చేసింది ఎవరు? రాత్రికి రాత్రి రాజరిక విధానాలకు చెల్లుచీటీ పాడిన సంగతి తెలుసా? సరే అవి సంక్షేమం కాదు, రెండు రూపాయిల కిలో బియ్యం లాంటివే సంక్షేమం అనుకుంటే ఎన్టీఆర్ కు ఆ విషయంలో ఆదర్శం ఎంజిఆర్ అని ఎవరన్నా లోకేష్ కు చెప్పండి. లేదంటే చరిత్ర పాఠాలు చదివించండి.
తమిళనాడులో స్కూలు పిల్లలకు పళ్ల పొడి పథకం దగ్గర నుంచి అనేకానేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది ఎంజీఆర్ కాదా? రాజకీయాల్లోకి రావడం దగ్గర నుంచి పథకాల వరకు ఎన్టీఆర్ కు ఎంజిఆర్ నే కదా ఆదర్శం. అది లోకేష్ కు ఎవరన్నా చెప్పాలి. లేదూ అంటే ఇలాంటి తప్పుడు స్టేట్ మెంట్ లు ఇస్తూనే వుంటారు.
ఎల్లో మీడియా హ్యాండిళ్లకు అదే గొప్ప విషయం అనిపిస్తుంది. అదే ట్వీట్ లు వేసి ప్రచారం చేస్తూనే వుంటారు.