Advertisement

Advertisement


Home > Politics - Analysis

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి

అల వైకుంఠపురంలో వినిపించిన ' నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు' అన్న సాంగ్ చినబాబు లోకేష్ నాయుడుని బాగా ఆకట్టున్నట్లు కనిపిస్తోంది. అయితే పొలిటికల్ లీడర్ గా మారి, పార్టీ పగ్గాలు తాను కూడా ఓ చేత్తో పట్టుకున్న తరువాత సహజంగానే రొమాంటిక్ యాంగిల్ ను వదిలేయాల్సి వచ్చి వుండొచ్చు. అందుకే ఆ పాటను వేరే విధంగా గుర్తు చేసుకుంటున్నారు. 

వైకాపాలో వున్న హోమ్ డిపార్ట్ మెంట్  లో ప్రతిపక్షం టైపు ఎంపీ రఘురామకృష్ణం రాజు బర్త్ డే వచ్చింది. అందరూ విసెష్ చెప్పారు. ఆయన ఆప్తులు, సన్నిహితులు, నచ్చిన వారు, నచ్చని వారు అందరూ.  కానీ వాళ్లంతా జస్ట్ విసెష్ చెప్పారు. మహా అయితే ఒకటి రెండు ఉపమానాలు జోడించారు. 

కానీ చినబాబు లోకేష్ నాయుడు మాత్రం తనలోని ఆ పాత..ఆ పాట అభిమానాన్ని బయటకు తీసారు. గతంలో రఘురామ కృష్ణం రాజు జనాలకు అందించిన కాళ్లు, పాదల ఫొటోలు బయటకు తీసారు. అప్పట్లో తనను  పోలీసులు కొట్టారు అని చెప్పడం కోసం ఈ విధమైన ఫొటోలకు ఫోజులు ఇచ్చారు రఘురామ కృష్ణం రాజు. ఇప్పుడు లోకేష్ బాబు ఆ ఫోటోలు చూపిస్తూ, బర్త్ డే విసెష్ చెప్పారు.

చూస్తుంటే 'ఆ కాళ్లను పట్టుకుని' వదిలేలా కనిపించడం లేదు. తమ పార్టీని కాచి బ్రోచేది ఈ పాదాలే అన్నట్లు ఫీలవుతున్నారేమో? వైకాపా లో వుంటూ తెలుగుదేశం పార్టీకి పనికి వచ్చేలా నిత్యం పోరు సలుపుతున్నారు కదా అందుకే ఆ మాత్రం భక్తి శ్రద్ధలు వుండాలి. 

అంత వరకు బాగానే వుంది. ఎవరైనా చేదు సంఘటనలు మరచిపోవాలి అనుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి జీవితంలో జరిగిన (జరిగి వుంటే) చేదు సంఘటనను అతని  బర్త్ డే నాడు గుర్తు చేస్తూ విసెష్ చెప్పడం అనే ఐడియా వుంది చూసారూ....అబ్బో సూపరెహె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?