నేను సిఎమ్ ని..నేను సిఎమ్ ని..నేనే సిఎమ్ ని

ఏమిటో పాపం, ఏమనుకోవాలో, ఓట్లు చీలనివ్వను..నాకు బలం లేదు. కొని చోట్లే పోటీ చేస్తాను. జగన్ ను గద్దె దింపుతాను అంటారు. అంతలోనే నేను సిఎమ్ ను, నేనే సిఎమ్ ను అంటూ రంకెలు…

ఏమిటో పాపం, ఏమనుకోవాలో, ఓట్లు చీలనివ్వను..నాకు బలం లేదు. కొని చోట్లే పోటీ చేస్తాను. జగన్ ను గద్దె దింపుతాను అంటారు. అంతలోనే నేను సిఎమ్ ను, నేనే సిఎమ్ ను అంటూ రంకెలు వేస్తారు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. అసలు తన గురించి తానేం అనుకుంటున్నారో అర్థం కాదు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు చాలా ఇబ్బంది కరమైన పరిస్థితి ఇది.

ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాననే భయం. అలా ఓడిపోతే పార్టీని మరో అయిదేళ్లు బతికించడం కష్టం అనీ తెలుసు. అందువల్ల తెలుగుదేశం అండ తప్పని సరి. జగన్ ను కలిసి కట్టుగా ఓడించాలి అనేది కేవలం ఓ సాకు మాత్రమే. తన పార్టీకి కాసిన్ని స్థానాలైనా దక్కాలి. అయిదేళ్లు పార్టీని నిలబెట్టుకుని 2029కి రెడీ కావాలి. ఇదీ వ్యూహం. అందుకోసమే తెలుగుదేశం పొత్తును తప్పని సరి చేసుకున్నారు.

పైగా త్యాగాలు చేయాలి అని కాపు ఓటర్లకు హిత బోధ చేసారు. తాను ఎలాగూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా త్యాగం చేస్తున్నారు కదా. మరి ఇన్నీ చేస్తూ, ఇప్పుడు కొత్తగా తాను ముఖ్యమంత్రిని అంటూ రంకెల ఎలా వేస్తారు? దీన్ని తెలుగుదేశం జనాలు, అభిమానులు ఎలా తీసుకోవాలి. అంటే హంగ్ ఏర్పడుతుందని, చంద్రబాబును కాదని తననే సిఎమ్ ను చేసే పరిస్థితి వస్తుందని పవన్ అనుకుంటున్నారా?

అలా రావాలంటే పవన్ కనీసం యాభై సీట్లలో పోటీ చేయాల్సి వుంటుంది. తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనిపించుకుంటేనే పవన్ కోరిక నెరవేరుతుంది. కానీ అసలు పోటీ కి దిగేదే ఇరవై పాతిక స్థానాలు అయితే సిఎమ్ పదవి ఎలా వస్తుంది. ఎలా వరిస్తుంది.

నిజంగా అద్భుతం జరిగిపోయి, పవన్ ఎమ్మెల్యేలే ట్రంప్ కార్డ్ అయితే, పవన్ కు సిఎమ్ పదవి ఇవ్వరు సరి కదా, ఆ గెలిచిన వారిని కూడా లాగేస్తారు. పవన్ చేసేదేమీ వుండదు.

ఇవేవీ తెలియకుండా, గ్రౌండ్ రియాల్టీ తెలియకుండా పవన్ మాట్లాడుతున్నారా?

లేక కేవలం కాపులు తమ పవన్ సిఎమ్ అవుతాడు అనే భావనకు లోనవ్వాలని ఇలా బ్లఫ్ చేస్తున్నారా?