వినే వాళ్ళు జనసైనికులు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అన్నట్లు సాగింది కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ లో. ఎప్పుడూ చెప్పినట్లుగానే జగన్ పై, తన అభిమానులపై అదే ఏడుపు కొనసాగించారు. తనను కక్ష కట్టి ఓడించారని.. తన అభిమానులు.. తన కులం వాళ్ళు జగన్ కు ఓట్లు వేశారని.. అక్కసు వెళ్లగక్కారు.
ప్రజాసేవ కోసం సినిమాలు చేస్తున్నానంటూ.. వచ్చే ఎన్నికల్లో తను అసెంబ్లీలో అడుగుపెడతానని కరాకండిగా చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. గతంలో మాదిరిగా రెండు చోట్ల పోటీ చేస్తారా లేక ఒక చోటే పోటీ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతా అంటూ శపథం చేసినప్పుడు ఎక్కడ నుండి పోటీ చేయబోతున్నా అనే విషయంపై క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదంటూన్నారు జనసైనికులు. మరోవైపు ముందే తను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటిస్తే అక్కడ జరిగే రాజకీయ పరిణామాలు ఉహించి ప్రకటించలేదంటూన్నారు కొందరు.
రాజకీయలు అంటేనే ప్రత్యర్థి ఓటమి కోసం అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తారు. వాటిని ఛేదించిన వారే విజయం సాధిస్తారు. అంతే తప్పా నన్ను ఓడించారు.. మీరు వారికే ఓటు వేశారు అంటూ అక్కసు వెళ్లగక్కితే వచ్చేది ఏమి లేదు. అయిన ఎంతసేపు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కాకుండా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు.. అభిమానులు తనను ఎందుకు రాజకీయంగా దూరం పెడుతున్నారు.. తన కులం వాళ్లు ఎందుకు నమ్మట్లేదు అనే దానిపై ఆలోచించి.. వాటిపై వారందికి క్లారిటీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.