Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎన్టీఆర్ తీరానికి చేరిన తుపాను

ఎన్టీఆర్ తీరానికి చేరిన తుపాను

అటు తిరిగి ఇటు తిరిగి మరేదో తీరానికి చేరింది తుపాను అన్నట్లుంది వ్యవహారం. ఇప్పుడు గొడవ అంతా యూనివర్సిటీ పేరు మార్చారని కాదు. ఎన్టీఆర్ కమ్మవాడా కాదా? ఎన్టీఆర్ తెలుగుదేశం మద్దతు దారా కాదా? ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీనా కాదా? ఇక్కడకు చేరింది వివాదం.

ఆంధ్ర సిఎమ్ జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బాలయ్యా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. రెండూ రెండు రకాలుగా వివాదానికి గురయ్యాయి.

బాలయ్య వాడిని పదజాలం. తెలుగువాళ్లకి అన్నీ ఎన్టీఆర్ తప్ప మరెవరు కాదనే విధంగా స్టేట్ మెంట్ ఇవ్వడం విపరీతంగా నెగిటివిటీకి దారి తీసింది. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన వారు కూడా బాలకృష్ణ స్టేట్ మెంట్ ను తప్పు పట్టారు. ఇక ఎన్టీఆర్ స్టేట్ మెంట్ మరో విధంగా వెళ్లింది. తెలుగుదేశం మద్దతు దారులు, ముఖ్యంగా ఓ సామాజిక వర్గ జనాలు ఆ స్టేట్ మెంట్ తో సంతృప్తి చెందలేదు. దాంతో బాహాటంగానే ఎన్టీఆర్ మీద పడుతున్నారు.

సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియోలో అయితే బాలయ్య, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న మాత్రమే ఎన్టీఆర్ బ్లడ్ అని, జూనియర్ ఎన్టీఆర్ కాదని బలంగా అనడం దారుణం. పార్టీకి మద్దతు ఇస్తే బడ్ల్ లేదంటే కాదా? ఇదెక్కడి చోద్యం.

భాజపా నేత జివిఎల్ నరసింహారావు కూడా ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఇలా ఇప్పుడు వివాదం అంతా ఎన్టీఆర్ మద్దతు దారులకు, తెలుగుదేశం మద్దతు దారులకు నడుమకు మారింది. ఇక్కడన్నా ఈ తుపాను బలహీనపడుతుందో, మరెటు దారి మళ్లుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?