పెళ్లిళ్లు… కులం… మతం ఏం టార్చర్ ప‌వ‌న్!

పవన్ కళ్యాణ్ జనసేన అజెండా ఏంటంటే ప్ర‌జ‌లంద‌రికి టక్కున గుర్తొచ్చేది మూడే మూడు కులం.. మతం.. పెళ్లిళ్లు.. ఏ మీటింగ్‌లో మాట్లాడిన ఈ మూడిటిలో ఏదో ఒక దానిపై మాత్ర‌మే మాట్లాడుతూ జ‌నంలో ప‌వ‌న్…

పవన్ కళ్యాణ్ జనసేన అజెండా ఏంటంటే ప్ర‌జ‌లంద‌రికి టక్కున గుర్తొచ్చేది మూడే మూడు కులం.. మతం.. పెళ్లిళ్లు.. ఏ మీటింగ్‌లో మాట్లాడిన ఈ మూడిటిలో ఏదో ఒక దానిపై మాత్ర‌మే మాట్లాడుతూ జ‌నంలో ప‌వ‌న్ అంటే ఈ మూడు త‌ప్పా వేరేవి మాట్లాడారు క‌దా అని భావించే లాగా చేసుకుంటున్నారు. జ‌న‌సైనికులు కూడా త‌మ నాయ‌కుడు ఈ మూడిటిపైనే ప‌దేప‌దే మాట్లాడి టార్చ‌ర్ పెడుతున్నారంటూ వాపోతున్నారు. 

జగన్.. రెడ్డి కాబట్టి నేను రెడ్డి సోదరులను వదులుకోను… జగన్ క్రిస్టియన్ కాబట్టి ముస్లింలు జగన్ కు ఓటు వేస్తున్నారు.. నాకు మూడు పెళ్లిళ్లు జరిగాయాని తిడుతున్నారు కావాలంటే మీరు చేసుకోండి… అలా మూడు పెళ్లిళ్లు కూడా ఏలా చేసుకోవాలో(భ‌ర‌ణం గురించి వివ‌ర‌ణ‌) ఆయన వివరిస్తారు. ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర ప్రాంత భావ‌న అనేది లేక‌పోయిన క‌నీసం కుల భావ‌న అయిన పెట్టుకోమని స‌ల‌హా ఇస్తారు. గుడుల‌పై దాడుల వెనుక జ‌గ‌న్ మ‌త అజెండా ఉంద‌ని అయ‌నే చెప్పుతారు. మ‌ళ్లీ క్రిస్టియ‌న్స్ కోసం పొరాటాం చేస్తా అంటారు. ఆయ‌న‌ మాట‌లు విన్న వారంద‌రు ప‌వ‌న్ పార్టీ అజెండా కులం, మ‌తం, పెళ్లిళ్ల గురించి త‌ప్పా ఇంకో మాట లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు.

కుల మతాలకు.. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని వారి లోపల ఏదీ ఉన్నా లేకున్నా కనీసం ప్రజల దగ్గరయినా రాజ‌కీయ నాయ‌కులు ప్రమాణం చేస్తారు. అలాగే ఏ సభలో అయిన‌ వాటిపైన ఆచి తూచి మాట్లాడుతారు. కానీ ప‌వ‌న్‌లో కులాల గురించి మాట్లాడుతూ.. ఓ కుల సంఘానికి నాయ‌కుడుగా, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. ఓ సంఘ సంస్కర్తగా, మ‌తాల గురించి మాట్లాడుతూ.. ఓ మ‌త గురువుగా క‌నిపిస్తున్నారే త‌ప్పా రాజ‌కీయ నాయ‌కుడుగా క‌నిపించ‌డం లేదు. 

బ‌హుశా రాజ‌కీయాలు కూడా సినిమాలు అనుకోని ర‌క‌ర‌కాల వేషాలు వేస్తూ… సినిమా డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటే సినిమా చివ‌ర్లో హీరో గెలిస్తారు అన్న‌ట్లుగా తాను ఎమ్మెల్యే అయిపోతా అని భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోందంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సీఎం కావాల‌నే ఆశ ఉన్న ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ప‌వ‌న్ చెప్పే ఈ మూడు విష‌యాల గురించి త‌క్కువ మాట్లాడితేనే మంచిదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.