చెప్పే మాటలు.. వేసే డైలాగులతో ఆయన ఆచరణకు అణుమాత్రమైనా సంబంధం లేకుండాపోయింది! మనల్ని ఎవ్వడ్రా ఆపేది.. అన్నారు, ఆఖరికి 24 నియోజకవర్గాల్లో పోటీకి అనుమతి తెచ్చుకున్నారు! పవన్ కల్యాణ్ అభిమానులు సీఎం, సీఎం.. అనే కలల్లో ఉన్నారు!
ఎప్పటికైనా మీరు సీఎం అవుతారు బాబూ, అవుతారు.. అని వారు ఆనంద భాష్పాలను రాల్చేంత ఎమోషన్ తో ఉంటారెప్పుడూ! మరి పార్టీ పెట్టిన పదేళ్లకు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి తన దత్తతండ్రి స్థాయి వ్యక్తి నుంచి అనుమతి తెచ్చుకున్న పవన్ కల్యాణ్ కలలో అయినా ఇక సీఎం కాగలరా?
తన అభిమానగణాన్ని, కులం పేరును తాకట్టు పెట్టి పవన్ కల్యాణ్ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు! వాటిల్లో ఆయన ఇప్పటి వరకూ ప్రకటించుకున్న అభ్యర్థుల సంఖ్య కూడా ఐదు! అందులో నిన్నా మొన్న ఆ పార్టీలో చేరిన వారి పేర్లే మూడు నాలుగున్నాయి! మరి మిగతా స్థానాల్లో అభ్యర్థులెవరనే అంశం గురించి కూడా చంద్రబాబు నిర్ణయానుసారం జరగాల్సిందే!
అక్కడ ఎవరు పోటీ చేయాలి, వారిని ఏ పార్టీ నుంచి తెచ్చుకోవాలి, వారికి ఎప్పుడు జనసేన కండువా వేయాలి, జనసేన తరఫున ఎవరు నామినేషన్ వేయాలి, వారికి రెబల్ గా టీడీపీ నేతలెవరు నామినేషన్ వేయాలి, అలాంటి నామినేషన్లలో ఎవరికి మళ్లీ తెలుగుదేశం బీఫారం ఇవ్వాలి.. అనేది ఇక చంద్రబాబు డిసైడ్ చేస్తారు! పవన్ కల్యాణ్ ఇక ప్రచారానికి వెళ్లి చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయాలంటూ ఓట్లడగడమే తప్ప అంతకు మించిన సీన్ కూడా లేదు!
రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. గాయిగత్తర లేపేలా కూడా పవన్ మాట్లాడలేడు! మహా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, చంద్రబాబును పొగడాలి! ఈ మేరకు పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ లు అందవచ్చు! ఇంతబతుకూ బతికి చంద్రబాబును పొగుడుతూ వీధుల్లో తిరిగి, ఆయనను సీఎం చేయాలని ప్రాధేయపడాల్సిన పరిస్థితికి దిగజారిన పవన్ కల్యాణ్ ఎన్నికలకు రెండు నెలల ముందే ఓడిపోయాడనడంలో ఆశ్చర్యం లేదు!