పవన్..ఆ మాత్రం అబద్దాలు చెప్పాలి

2024లో జ‌నసేన ప్రభుత్వం …అధికారంలోకి రాగానే సిసిఎస్ రద్దు..ఇంకా ఇంకా అనేక వరాలు.. Advertisement మంగళగిరి పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం అలాగే సాగింది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని… పార్టీ…

2024లో జ‌నసేన ప్రభుత్వం …అధికారంలోకి రాగానే సిసిఎస్ రద్దు..ఇంకా ఇంకా అనేక వరాలు..

మంగళగిరి పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం అలాగే సాగింది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని… పార్టీ నాయకుడు ఏం చెప్పినా కార్యకర్తలు, చోటా నాయకులు వింటారు కానీ ఎలా సాధ్యం అని అడగరు కదా. అందుకే పవన్ అంతా కాన్ఫిడెన్స్ గా అబద్దాలు చెప్పేస్తున్నారు అనుకోవాలేమో?

తెలుగుదేశంతో పొత్తు అంటారు. భాజ‌పా, ఇంకా ఇంకా చాలా అంటే చాలా మందిని కలుపుకుంటాం అంటారు. మరి జ‌నసేన ప్రభుత్వం ఎలా ఏర్పాటు అవుతుందో మాత్రం చెప్పరు. పోనీ తెలుగుదేశం-జ‌నసేన కలిసిన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నది పవన్ ఉద్దేశం అనుకుందాం. మరి తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా సిసిఎస్ రద్దు అన్నది వుండాలి కదా? వాళ్ల తరపున కూడా ఈయనే మాట ఇస్తారా?

ఇదిలా వుంటే విశాఖలో విధ్వసం జ‌రుగుతుందని తనకు ముందే తెలుసు అని, అయినా ప్రాణాలకు తెగించి వెళ్లానని పవన్ అన్నారు. ఇది మరీ చిత్రంగా వుంది. విధ్వసం సృష్టించింది జ‌నసేన కార్యకర్తలు. వైకాపా మంత్రుల మీద రాళ్లేసింది జ‌నసైనికులు. అంటే వాళ్లు రాళ్లేస్తారని పవన్ కు ముందెే తెలుసా? మరి తన మనుషులు రాళ్లేస్తే తన ప్రాణాలకు తెగించడం ఏమిటో?

ఏమైనా పవన్ ప్రసంగాలు భలే స్ట్రెస్ బస్టర్ లు గా మారుతున్నాయి రాను రాను.