cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Analysis

రాజకీయ సమాధికి రాళ్లు పేర్చుకుంటున్న పవన్

రాజకీయ సమాధికి రాళ్లు పేర్చుకుంటున్న పవన్

2014లో వ్యూహం అన్నారు, 2019లో అధికారంలోకి వస్తున్నామని ప్రగల్భాలు పలికారు. 2024లో జగన్ ని ఓడించి తీరతామంటున్నారు. ఈ రాజకీయ పరిణామ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్.. ఇకపై ఎప్పటికీ పైకి లేవలేని విధంగా తన రాజకీయ సమాధిని తానే పటిష్టంగా కట్టుకుంటున్నారు. తనను తాను పొలిటికల్ గా దిగజార్చుకుంటున్నారు.

రీజన్ 1: చంద్రబాబుతో స్నేహం..

చంద్రబాబుతో స్నేహం చేస్తే చివరికి మిగిలిదేంటనేది ఈపాటికే అందరికీ అర్థమైంది. ఆ విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ ఇంకా మొండిగా, ఒకరకంగా చెప్పాలంటే మూర్ఖంగా వెళ్తున్నారు. చంద్రబాబుతో స్నేహం.. జనసేన వినాశనం అని వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈసారి కూడా పవన్ ఆయన బుట్టలో పడ్డారు. 

బాబు విదిల్చే 10 లేదా 20 సీట్లతో సరిపెట్టుకుంటే పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ ఎప్పటికీ గేరు మార్చలేదు. పైగా ఈసారి చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా పవన్ కి చుట్టుకుంటుంది. ప్రతిపక్షంగా అట్టర్ ఫ్లాపైన బాబు, తన ఏడుపు ఎపిసోడ్ తో మరింత పలుచన అయ్యారు. ఆయనతో చేయి కలిపే ఏ పార్టీకైనా చివరికి మిగిలేది ఆ ఏడుపే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. పవన్ దీనికి అతీతం కాదు.

రీజన్ 2: మెగా అభిమానులను ఏకం చేయాలనుకోవడం..

పవన్ కల్యాణ్ చెప్పారో, లేక నాగబాబు సలహా ఇచ్చారో తెలియదు కానీ.. మొత్తానికి మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఏకమై పవన్ కి మద్దతివ్వాలనుకుంటున్నారు. దీనివల్ల ఒరిగేదేంటి.. సినిమాలు, రాజకీయాలు కలిస్తే సాధించేదేంటి. అనుకోకుండా పవన్ వైరి వర్గమంతా ఏకమవుతుంది. 

ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఆ బ్యానర్లో బన్నీ బొమ్మ పడలేదు కాబట్టి.. కచ్చితంగా అల్లు అర్జున్ ఆర్మీ పవన్ కి వ్యతిరేక వర్గంగా మారిపోతుంది. సో.. మెగా ఫ్యాన్స్ కలయిక అనేది పార్టీ వినాశనానికి తప్ప మరొకటి కాదు.

రీజన్ 3: తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టాలనుకోవడం..

తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలోనే పవన్ కి అంతో ఇంతో పొలిటికల్ ఇమేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఆయన తెలంగాణపై కూడా ఆశపడుతున్నారు. కనీసం 30 స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకుంటున్నారు. అక్కడ కేసీఆర్ కి, కాంగ్రెస్, బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎంఐఎం కి డెడికేటెడ్ ఓటుబ్యాంక్ ఉంది. సో.. అక్కడ పవన్ పాచిక పారదు. 

తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోతే.. ఆ మరుసటి ఏడాది ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జనసేన ఇమేజ్ కచ్చితంగా డ్యామేజీ అవుతుంది. ఆ ముందుచూపు ఉంటే.. పవన్ తెలంగాణ నుంచి డ్రాప్ అవుతారు, లేదంటే అక్కడా, ఇక్కడా రెండుచోట్లా దారుణంగా దెబ్బతింటారు.

రీజన్ 4: ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా ప్లానింగ్ లేదు..

ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ప్రస్తుతం పవన్ స్కోర్ జీరో. వచ్చే దఫా అధికారంలోకి రావాలంటే పవన్ ఏం చేయాలి. కచ్చితంగా ఈ రెండేళ్లు కష్టపడాలి. కానీ ప్రస్తుతం పవన్ చేస్తున్నదేంటి..? అధికార పార్టీని తిడుతున్నారు, అడపా దడపా ట్విట్టర్లో కనిపిస్తున్నారు, ఇటీవల కౌలు రైతుల కోసం రెండు మూడు చోట్ల పర్యటించారు.

ఇంతేనా..? మిగతా వర్గాలకు పవన్ తరపున హామీలేంటి..? గ్రామాల్లో క్యాడర్ బలోపేతం అవుతుందా లేదా..? పార్టీ తరపున నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను ప్రకటించి, వారి పురోగతి పట్టించుకున్నారా లేదా..? ఇవేవీ జరగట్లేదు. 

ఎంత సేపు పవన్ కల్యాణ్ ఇమేజ్ కోసం చూస్తున్నారే కానీ, ఆ పార్టీ తరపున టికెట్ పై గెలవాలనుకుంటున్నవారికి కాస్త పుషప్ ఇవ్వాలి కదా. పోనీ జగన్ లాగా ఫ్యాన్ గుర్తు చూసి ఓట్లేయడానికి పవన్ కి ఇక్కడ అంత సీన్ లేదు. ఆయనలాగా పాదయాత్ర చేసే ఓపికా తీరికా రెండూ లేవు. 

ప్రస్తుతానికి సినిమాలకు కాల్షీట్లిస్తూ టైమ్ సరిపెడుతున్నారు. రెండు పడవలపై కాళ్లు వేశారు. చేతిలోని సినిమాలు పూర్తవడానికే రెండేళ్లు పడుతుంది. ఇక రాజకీయాలెక్కడ. సో.. పవన్ ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి