పాపం.. అమలాపురం పోలీస్

అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఎక్కడా ఎవరిపై లాఠీ విరిగిన దాఖలాలు లేవు కానీ 20మంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. తలలు పగిలాయి. కానీ చివరకు పోలీసులే విమర్శలు ఎదుర్కోవడం నిజంగా బాధాకరం.  Advertisement…

అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఎక్కడా ఎవరిపై లాఠీ విరిగిన దాఖలాలు లేవు కానీ 20మంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. తలలు పగిలాయి. కానీ చివరకు పోలీసులే విమర్శలు ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. 

ప్రజా ప్రతినిధులను అమలాపురం నుంచి ఖాళీ చేయించి వెంటనే పక్క ప్రాంతాలకు తరలించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఆ పని చేయకపోయి ఉంటే మంత్రి పినిపే విశ్వరూప్ ఇంట్లో మారణహోమం జరిగి ఉండేది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ఎక్కడా పట్టు తప్పలేదు. సున్నితమైన అంశం కాబట్టి.. ఇరు వర్గాలకు సర్ది చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. దాదాపుగా ఈరోజు పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే.

అమలాపురంలో 2 రోజులుగా 144 సెక్షన్ అమలులో ఉంది. ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నా పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నమే చేశారు. ఇప్పటికే పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో లాఠీచార్జి చేస్తే మరింతి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పోలీసులు ఆచితూచి స్పందించారు. 

అమలాపురం మొత్తం అట్టుడికిపోయినా.. ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదంటే దాని వెనక పోలీసుల వ్యూహాన్ని మెచ్చుకోవాల్సిందే. రెండు వర్గాల్లోనూ ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేశారు. చివరకు ఆ రాళ్లదెబ్బలేవో తామే తిన్నారు.

అదనపు బలగాలు..

సహజంగా కోనసీమలో ఈ స్థాయిలో గొడవలు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ ప్రతిపక్షాల టార్గెట్ వేరే. జగన్ లేని సమయంలో ఏదో ఒక హడావిడి చేసి రాష్ట్రంలో అశాంతి మొదలు పెట్టాలనే పన్నాగం పన్నారు. దాదాపుగా ఆ  విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ వారు అనుకున్నట్టు మారణహోమం జరగలేదు. 

ఎల్లో మీడియా ఎదురు చూసిన లాఠీ చార్జీ క్షణాలు, ఆందోళనకారుల ఆర్తనాదాలు, ఆస్పత్రి బెడ్లు.. ఇలాంటి సీన్లు జరగలేదు. ఈ క్రెడిట్ పోలీసులదే. బస్సుకి నిప్పు పెట్టడం, మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినా.. ప్రాణ నష్టం లేకుండా చూడగలిగారు పోలీసులు. 

ప్రస్తుతం అమలాపురానికి అదనపు బలగాలు వస్తున్నాయి. మొదటిరోజు ఇచ్చినంత ఛాన్స్ రెండోరోజు ఆందోళనకారులకు ఇచ్చేలా లేరు పోలీసులు. ఈరోజు ఎక్కడికక్కడ ఆందోళనకారుల్ని అడ్డుకోడానికి రెడీ అయ్యారు. అరెస్ట్ లకు రంగం సిద్ధం చేశారు.