పవన్..పగడం..పరమార్థం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాగైనా పవర్ అందుకోవాలని చూస్తున్నారు. గిట్టని వాళ్లు చంద్రబాబుకు పవర్ అందించాలని చూస్తున్నారు అని కూడా అంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన చేతికి పెద్ద సైజు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాగైనా పవర్ అందుకోవాలని చూస్తున్నారు. గిట్టని వాళ్లు చంద్రబాబుకు పవర్ అందించాలని చూస్తున్నారు అని కూడా అంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన చేతికి పెద్ద సైజు పగడం పొదిగిన ఉంగరం ధరించారు. 

పవన్ కు నమ్మకాలు ఎక్కువే. ఆయన జ‌న్మతహ బ్రాహ్మణ/క్షత్రియ/వైశ్యుడు కాకపోయినా, త్రివిక్రమ్ ద్వారా ఉపనయనం చేయించుకున్నారు. ఇప్పటికీ జంధ్యం ధరిస్తున్నారు. అలాగే ఏటా భారీ హోమాలకు ఆయన నుంచి విరాళాలు వెళ్తాయి.

ఇప్పుడు పగడం చేతికి ధరిచడం చూసి అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. పగడం అసలు దేనికి ధరిస్తారు అన్నది ప్రశ్న. పగడం దేనికి ధరిస్తారు అనే కన్నా, ఎవరు ధరించినా మంచిదే.  జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు లేదా కుజుడు అనే గ్రహశాంతికి పగడం వాడతారు. 

కర్ణాటకలో చాలా వరకు మహిళలు మెడలో పగడాలు ధరించడం పద్దతిగా వుంది. మన దగ్గర కూడా మహిళలు తమ మంగళ సూత్రాల్లో పగడాలు వుంచుకుంటారు. వివాహ బంధం పటిష్టంగా వుండడానికి, వివాహానికి సంబంధించిన చికాకులకు పగడం మంచిది. ఎందుకంటే వాటికి కారకుడు కుజుడే కనుక.

ఆ సంగతి అలా వుంచితే రాజ‌కీయ అధికార సాధన, నాయకత్వ పటిమ, పోరాట పటిమ పెపొందడానికి కూడా పగడం ఉపకరిస్తుంది అని అంటారు. మరి వీటన్నింటిలో దేని కోసం పవన్ పగడం ఉంగరం ధరించారో? ఎవరు దాన్ని సజెస్ట్ చేసారో? అంత పెద్ద మేలిమి పగడం పొదిగిన ఉంగరం మరీ లక్షలకు లక్షలు ఖరీదేమీ అయిపోదు.