పవన్ – ప్రతిసారీ ఇదో ముచ్చట

ఎప్పుడైనా ఓ సారి వచ్చిన వాళ్లు అతిధులు వాళ్లకు సత్కారం అన్నది సంస్కారం. పవన్..చంద్రబాబు చెట్టపట్టాలు వేసుకున్న మిత్రులు. పవన్ లక్ష్యం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం. అది అందరికీ తెలిసిందే. అందుకోసం చంద్రబాబు ఎలా…

ఎప్పుడైనా ఓ సారి వచ్చిన వాళ్లు అతిధులు వాళ్లకు సత్కారం అన్నది సంస్కారం. పవన్..చంద్రబాబు చెట్టపట్టాలు వేసుకున్న మిత్రులు. పవన్ లక్ష్యం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం. అది అందరికీ తెలిసిందే. అందుకోసం చంద్రబాబు ఎలా చేయమంటే అలా చేస్తారు పవన్. అందులో భాగంగా తరచు కలుస్తూనే వున్నారు.

గమ్మత్తేమిటంటే కలిసిన ప్రతిసారీ పవన్ కు ఓ పసుపు శాలువా కప్పుతారు చంద్రబాబు. ఈసారి పసుపు పూల బొకే కూడా ఇచ్చారు. అంటే నువ్వూ మా పార్టీ వాడివే అన్నంత సింబాలిజమ్ అనుకోవాలి. ప్రతీసారీ శాలువ కప్పడం ఏమిటి అని కాస్త ఆశ్చర్యంగా వుండొచ్చు. కానీ అక్కడే వుంది మర్మం.

పవన్ కు కావాల్సింది ఇలాంటి మెహర్బానీలే. ఆ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. తాను అధికారంలో వున్నపుడు స్పెషల్ ఫ్లయిట్ పంపడం, మంత్రిని కూడా పంపి మరీ సాదరంగా పవన్ ను రప్పించుకోవడం, అడగులకు మడుగులు వత్తడం చేసారు. పవన్ కు ఇవి చాలు. ఆ మెహర్బానీగా పవన్ పడిపోతారని, అదే కోరుకుంటారని చంద్రబాబుకు అర్థం అయిపోయింది. ప్రతిసారీ ఈ శాలువా ముచ్చట జరిపిస్తూ వుంటారు. పవన్ కూడా తనకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి మురిసిపోతారు.

కానీ ఈ మురిపం ఎప్పటి వరకు వుంటుంది అంటే సరైన సీట్లు కేటాయించడంలో. కనీసం నలభై సీట్లు కేటాయించాలి. చంద్రబాబు అలా కేటాయించాల్సి వస్తే, తన మనుషుల్ని జనసేనలోకి పంపి అక్కడ టికెట్ లు ఇప్పిస్తారు. ఇది చంద్రబాబు కు అలవాటైన స్ట్రాటజీనే. కానీ జనసేన గ్రౌండ్ లెవెల్ జనాలకు తెలుసు కదా, ఎవరు ముందు నుంచి వున్నారో, ఎవరు ఆఖరి నిమషంలో వచ్చి టికెట్  పట్టుకుపోయారో. అప్పుడు వస్తుంది ఓటు బదిలీ సమస్య.

అయినా ఇవేమీ వపన్ కు పట్టవు. ఆయనకు శాలువా కప్పుతూ, అడుగు అడుగునా అతనంటే అపారమైన భయ భక్తులు, గౌరవం వున్నట్లు నటిస్తే చాలు. సినిమా హీరో కదా, నిర్మాతలు, ఇతర జనాలు అదే అలవాటు చేసారు. ఇప్పుడు అదే చంద్రబాబు కూడా పాటిస్తున్నారు.