కారులో మృతదేహం.. మణికొండలో కలకలం

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మణికొండలో నడిరోడ్డుపై కారులో మృతదేహం కలకలం రేపింది. గోల్డెన్ టెంపుల్ కు సమీపంలో నిలిపిఉన్న కారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. Advertisement…

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మణికొండలో నడిరోడ్డుపై కారులో మృతదేహం కలకలం రేపింది. గోల్డెన్ టెంపుల్ కు సమీపంలో నిలిపిఉన్న కారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు, మృతదేహాన్ని మార్చురీకి పంపించారు. మృతుడ్ని ఆటోడ్రైవర్ రమేష్ గా గుర్తించారు. అతడి ముక్కు నుంచి రక్తస్రావం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నిన్న స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లొచ్చాడు రమేష్. అక్కడే గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవే హత్యకు దారితీసిందా లేక రమేష్ గుండెపోటుతో మరణించాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు కారును ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కారు ప్రయాణించిన మార్గాన్ని, అందులో ఉన్న వ్యక్తుల్ని గుర్తించే పనిలో పడ్డారు.

అసలు రమేష్ ఆ ప్రదేశం వరకు ఎలా వచ్చాడో తెలిస్తే, ఆ తర్వాత కేసును ఈజీగా ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి అర్థరాత్రి వరకు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది.