Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్..వేషము మార్చెను

పవన్..వేషము మార్చెను

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వారు. ముఖ్యంగా సమయానికి తగిన డ్రెస్ లు ఎంచుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. 

కాస్సేపు గడ్డాలు మీసాలు పెంచేసి, లాల్చీ పైజామా వేసి, మేధావి లుక్ ఇస్తారు. మరి కాస్సేపు వారాహి అంటూ సైనిక వాహనం ఇమిటేషన్ వెహికిల్ తయారు చేయించుకుని, తాను కూడా మిలటరీ డ్రెస్ వేసుకుని ఫోజు ఇస్తారు. ఇలా సమయానికి, సందర్భానికి డ్రెస్ లు మార్చడంలో పవన్ స్పెషలిస్ట్.

చంద్రబాబులా ఒకే తరహా డ్రెస్ కోడ్ వుండదు. జగన్ మాదిరిగా ఒకే రకం డ్రెస్సింగ్ వుండదు. ఎందుకంటే పవన్ తన బలం ఏమిటో తెలుసు. తన ఫ్యాన్స్. వాళ్లని ఉర్రూతలూగించాలి. తమ హీరో సూపర్ అనుకోవాలి. కేరింతలు కొట్టాలి.

ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ గెటప్ మార్చారు. గెరిల్లా ఫైటర్ స్టయిల్ ట్రౌజర్ మీద, బ్లాక్ టీషర్డ్ వేసారు. ఆపై బ్లాక్ గాగుల్స్ తగిలించారు. అసలే ఈ మధ్య కాస్త వర్కవుట్ లు చేసి ఫిట్ గా మారారు కనుక బాగానే సెట్ అయింది డ్రెస్. ఈ డ్రెస్ లో ఏదో యుద్దానికి వెళుతున్న హీరో అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. అంతే తప్ప ఎన్నికలు, పార్టీ ఇలాంటి వ్యవహారాలేం లేవు.

జనసేన ఆవిర్బావ సభ సందర్భంగా బిసి ల సమావేశానికి వెళ్లడానికి ఈ బిల్డప్ అంతా. స్పెషల్ ఫ్లయిట్ లో దర్జాగా కూర్చుని ఓ స్టిల్..నడుస్తూ మరోటి. ఇంకో భంగిమలో ఇంకోటి. ఇవి చాలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఉర్రూత లూగిపోవడానికి.  వాళ్ల వీక్ నెస్ ఈయనకు తెలుసు. అందుకే ఇలా వేషాలు మారుస్తూనే వుంటారు. 

కానీ పార్టీని నమ్ముకున్న సీరియస్ పోలిటికల్ టచ్ వున్నవారు మాత్రం ఈయనేంట్రా బాబూ..వచ్చే నాలుగు ఓట్లు కూడా రానిచ్చేలా లేడు అని కామెంట్ చేస్తున్నారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా