Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్‌పై ఈనాడు కాల‌కూట విషం

జ‌గ‌న్‌పై ఈనాడు కాల‌కూట విషం

రామోజీరావుకి బాగా భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుంది. మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే జైలు త‌ప్ప‌ద‌ని అర్థ‌మైన‌ట్టుంది. అందుకని ప్ర‌తి అక్ష‌రంలో విషం క‌క్కుతున్నారు. సోష‌ల్ మీడియా లేక‌పోతే ఈ విషానికి జ‌గ‌న్ బలి అయ్యేవారే. గ‌తంలో ఎన్టీఆర్‌ని ఇలాగే బ‌లి చేశారు. ఈనాడు దృష్టిలో చంద్ర‌బాబు ఒక అద్భుతం, జ‌గ‌న్ ఒక అధ్వాన్నం.

19వ తేదీ ఏపీ ఎడిష‌న్ ఈనాడుని చూస్తే భ‌య‌మేస్తుంది. ఈనాడు ఇంత న‌గ్నంగా అబ‌ద్ధాలు రాయ‌డం ఇది మొద‌టిసారి కాదు. అయితే పాఠ‌కులు దాని నిజ‌స్వ‌రూపాన్ని గుర్తు ప‌డుతున్నారు. అదీ తేడా.

1. జ‌గ‌న్ ఏలుబ‌డి- బ‌లి పీఠంపై సాగుబ‌డి. ఇది బ్యాన‌ర్ వార్త‌. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో దేశంలో మూడోస్థాన‌మ‌ట‌.

మొద‌ట మ‌హారాష్ట్ర‌, రెండు కర్నాట‌క‌, మూడు ఏపీ.

మొద‌టి రెండు రాష్ట్రాల్లో బీజేపీ పెత్త‌న‌మే న‌డిచింది. రైతుల దుస్థితికి బీజేపీ కార‌ణ‌మ‌ని ఈనాడు రాయ‌గ‌ల‌దా?

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు వ్య‌వసాయ‌మే కాదు, ఇంకా చాలా కార‌ణాలుంటాయి.

వ్య‌వ‌సాయం గిట్టుబాటు కాక‌పోవ‌డం దేశ‌మంత‌టా వుంది.అది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే వున్న‌ట్టు జ‌గ‌న్‌కి పుల‌మ‌డం ఈనాడు ఉద్దేశం.

ఫ‌స్ట్ పేజీలో వేసిన ఈనాడు కేస్ స్ట‌డీని ప‌రిశీలిస్తే క‌ర్నూలు జిల్లా అంగ‌న‌క‌ల్లు రైతు జ‌య‌రాముడికి ఆరుగురు కుమార్తెలు. ఐదుగురికి పెళ్లి చేశారు. వ్య‌వ‌సాయంలో గిట్టుబాటు కాక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అధిక కుటుంబ భారం కార‌ణ‌మ‌ని అనుకోకూడ‌దు. ఈనాడు లెక్క‌ల ప్ర‌కారం జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణం.

తాళ్ల‌రేవు మండ‌లంలో 15 రైతు కుటుంబాలు వ‌ల‌స వెళ్లాయ‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ల‌స‌లు ప్రారంభ‌మై ద‌శాబ్దాలు దాటాయి. చంద్ర‌బాబు హ‌యాంలో వ్య‌వ‌సాయం అద్భుతం, జ‌గ‌న్ పాల‌న‌లో వ్య‌వ‌సాయం వ‌దిలి వ‌ల‌స‌లు వెళుతున్నార‌ట‌.

రాయ‌ల‌సీమ‌లో వేరుశ‌న‌గ నుంచి దూర‌మ‌య్యార‌ట‌. 1990లో మ‌లేషియా నుంచి పామాయిల్ దిగుమ‌తి ప్రారంభమైన‌ప్పుడే వేరుశ‌న‌గ నుంచి రైతులు దూర‌మ‌వుతూ వ‌చ్చారు. దీనికి కూడా జ‌గ‌నే కార‌ణ‌మా?

వ‌రికి గిట్టుబాటు కాక‌పోవ‌డం దేశ‌మంత‌టా వున్న స‌మ‌స్య‌. ఇది ఏపీ ప్ర‌త్యేకం కాదు.

పెట్టుబ‌డి వ్య‌యం పెరిగింద‌ట‌. 19లో వ‌రి ఎక‌రాకి 25 వేలు, ఇప్పుడు 40 వేలు. 2019లో రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్ అద్దె ఎంత‌?  ఇప్పుడు ఎంత‌? ఐదేళ్ల‌లో అన్ని ధ‌ర‌లు పెరిగాయి. ఇది ఈనాడు అజ్ఞానం కాదా?  

2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ హ‌యాంలో ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతున్నాయి క‌దా!

2). సీఎం తెచ్చిన న‌ర‌క‌యాత‌న వార్త‌లో ముఖ్య‌మంత్రి రోడ్ షో కార‌ణంగా ట్రాఫిక్ ఆగిపోయి జ‌నం ఇబ్బంది ప‌డ్డార‌ట‌.

చంద్ర‌బాబు సీఎంగా వున్న‌ప్పుడు ఆర్టీసీ బస్సులు వాడ‌నే లేదా?  ట్రాఫిక్ ఆగిపోలేదా?  జ‌గ‌న్‌తో కొత్త‌గా ఇబ్బందులు వ‌చ్చిన‌ట్టు రాయ‌డం జ‌ర్న‌లిజ‌మా?

3). ఇక ఎడిటోరియ‌ల్‌లో జ‌గ‌న్ వ‌ల్ల ప్ర‌తి నెత్తిన 2.04 ల‌క్ష‌ల రుణ‌భారం వుంద‌ట‌. ఆయ‌న ప‌థ‌కాల వ‌ల్ల అప్పుల భారం పెర‌గ‌డం నిజ‌మైతే అంత‌కు మూడింత‌లు ప‌థ‌కాలు అమ‌లు చేస్తానంటున్న చంద్ర‌బాబు ఏం చేయ‌బోతున్నారు?  అది క‌దా ప్ర‌త్యేక క‌థ‌నం రాయాలి. సంప‌ద సృష్టిస్తాన‌ని అంటున్న చంద్ర‌బాబుని న‌మ్మ‌కండి అని క‌దా రాయాలి.

4) అప‌రిచితుడు వ‌చ్చాడు క‌థ‌నంలో జ‌గ‌న్ టూర్ అంతా స్క్రిప్ట్ అట‌. ఎన్టీఆర్ కాలంలో రోడ్డు ప‌క్కన స్నానాలు స్క్రిప్ట్ స్టార్ట్ చేసింది మీరే క‌దా స్వామీ. అలిపిరి ఘ‌ట‌న త‌ర్వాత బాబు ఇంటికి జాత‌రలా జ‌నం అని ఫొటో వార్త‌లు స్క్రిప్ట్ కాదా?

స్క్రిప్ట్‌కి మూల పురుషులు త‌మరే క‌దా గురువిందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?