cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆర్కేతో ఆడేసుకున్న పాల్

ఆర్కేతో ఆడేసుకున్న పాల్

‘ఏవో ఒకటి రెండు యూ ట్యూబ్ చానెళ్లు వుంటాయి. డబ్బుల కోసం ఏదో చూపిస్తారు…మీరు వాటి లెవెల్ కు దిగకండి…’

ఇదీ కేఎ పాల్ డైలాగ్. ఆర్కే ఓపెన్ హార్ట్ ఇంటర్వూ సంగతి అందరికీ తెలిసిందే. ఆర్కే తనకు కావాల్సిన కోణంలో అవతలి వారితో ఇంటర్వూ చేస్తారు.. ఎదుటివారు మొహమాటానికో, మీడియా అధినేత అనో ఇబ్బందిగా కదులుతూనే ఏదో విధంగా సమాధానాలు చెబుతారు. ఈసారి గెస్ట్ కేఎ పాల్. ఈయన్ని కూడా అలాగే కిందా మీదా చేద్దాం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆర్కే ను మాట్లాడనివ్వకుండా, కిందా మీదా పెడుతూ పాల్ ఆడేసుకున్నారు.

‘ఎక్కడయినా ఇంటర్వూ అంటే ప్రశ్న చిన్నది వుంటుంది..సమాధానం పెద్దది వుంటుంది…’ అంటూ ఇంటర్వూ ఎలా వుండాలో పాల్ నే క్లాస్ పీకారు.

‘నా గురించి తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా? కావాలంటే ఎబిఎన్ లో పోల్ పెట్టండి’ అంటూ సవాల్ విసిరారు.

అక్కడితో ఆగలేదు…’మీ చానెల్ లో…మీ వెంకటకృష్ణ నాకు ఫోన్ చేసి, మీరు అర్జంట్ గా వచ్చేయండి..ఇక్కడ చాలా వాక్యూమ్ వుంది. మీరు పార్టీ పెట్టాలి’ అంటూ బయటపెట్టారు. కావాలంటే వెంకటకృష్ణను తీసుకువచ్చి ఇక్కడ కూర్చోపెట్టండి అని చెబితే ఆర్కే మాట పక్కకు తప్పించాల్సి వచ్చింది.

‘చూడండ్రా బాబూ..మీరే చెప్పండి..’ అంటూ ఆడియన్స్ ను ఆర్కే వైఖరి గురించి ఆలోచించేలా అప్పీల్ చేసారు.

‘బిలియన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. 500 కోట్లు..’ అంటూ చెణుకులు వేసారు.

‘ఎన్టీఆర్ కే ఏడాదిన్నర పట్టింది..చిరంజీవికి రెండేళ్లు పట్టింది. నేను వారంలో ఎలా గెలవగలను…’ అని ఎదురు ప్రశ్నించారు.

‘మోడీ ఒక్కరే 50 లక్షల కోట్ల అప్పు తెచ్చారు…అలాంటిది వదిలేయమంటారేంటీ…అన్ ఎడ్యుకేటెడ్ గా మాట్లాడుతున్నారు మీరు’ అంటూ ఎదురు వెళ్లారు.

చంద్రబాబు తన దగ్గరకు రెండు సార్లు వచ్చారు అని పాల్ అంటే…’ఆయన ఖర్మ’ అని ఆర్కే అనగానే ‘మీకు చంద్రబాబు అంటే ఎంత కోపం ఏమిటి?’ అని సెటైర్ వేసారు.

‘చంద్రబాబు దేవునికి దూరమై శాపగ్రస్థుడై ఇప్పుడు అసెంబ్లీలో, బయట ఏడుస్తున్నాడు. దేవుడిని, ఎన్టీఆర్ ను ఏడిపించడం వల్లే ఇప్పుడు చంద్రబాబు ఏడుస్తున్నాడు’ అంటూ ఏకరవు పెట్టారు. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అనే అర్థం వచ్చేలా వున్న బైబిల్ వాక్యాన్ని ఇక్కడ కోట్ చేసారు.

‘అమెరికన్ ప్రెసిడెంట్ కు పనీ పాటా లేదు..మీరు నేను బిజీనా… ఏం మాట్లాడుతున్నారు. మిమ్మల్ని జనం తిడతారు’ అంటూ సుద్దులు చెప్పారు.

‘ఆంధ్ర అంటే కొత్తది..చిన్నది…అప్పులు చేసారు అంటే అర్థం వుంది. మరి కేసిఆర్ ఎందుకు మిగులు వుండగా అంత అప్పులు చేసారు..’ అంటూ నిజాలు వెల్లడించారు.

కావాలంటే వీడియోలు ప్లే చేయండి...అంటూ ఒక దశలో ఆర్కేను మాట్లాడకుండా చేసారు కేఎ పాల్.

‘నేను కూడా చంద్రబాబులా రాత్రికి రాత్రి పారిపోతానని కేసిఆర్ అనుకున్నారేమో..నేను అలా చేయను..నాలా కేసిఆర్ ను కూడా రోడ్ల మీదకు రమ్మనండి ’ అంటూ ఇటు చంద్రబాబుకు అటు కేసిఆర్ కు చురకలు వేసారు.

‘నేను ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రికి అయినా మరి ఎవరికైనా ఓ బొకేె ఇచ్చానా? శాలువా ఇచ్చానా?’ అంటూ నిలదీసారు.

‘మీ దగ్గర ఆన్సర్ లేదు’ అంటూ మాటల్లేకుండా వుండిపోయిన ఆర్కేపై చతుర్లు వేసారు.

‘మీరేంటీ ఇలా మారిపోయారు…మీ మీద నాకు జాలేస్తోంది…ఇలా ప్రశ్నలేస్తే ప్రజలు సత్యం గ్రహిస్తారు అని మీరు ఆఫ్ ది రికార్డుగా అన్నారుగా అంటూ’ బయటపెట్టారు.

‘వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్’ అని ధైర్యంగా నిలదీయిగలిగారు.

మొత్తం మీద కేఎ పాల్ గంట సేపు ఆర్కేతో ఆడేసుకున్నట్లు కనిపించింది ఆ ఇంటర్వూ అంతా.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి