Advertisement

Advertisement


Home > Politics - Analysis

సెప్టెంబర్ నుంచి జగన్ కు తిరుగులేదు

సెప్టెంబర్ నుంచి జగన్ కు తిరుగులేదు

భారతదేశం కర్మ భూమి. ఇక్కడ నూటికి తొంభై శాతం మంది గ్రహగతులను, జాతకాలను, ముహుర్తాలను నమ్ముతారు. వాటి ప్రకారం నడుచుకుంటారు. గ్రహశాంతలు చేయించుకుంటారు. ముహుర్తాల ప్రకారం ముందుకు వెళ్తారు. అందులోనూ రాజకీయ నాయకులు, సినిమా నటులు, వ్యాపారాలు చేసేవారు అయితే ఇక చెప్పనక్కరలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఓ జ్యోతిష్కుడు జగన్ జాతకాన్ని ఒక వీడియోలో విశ్లేషించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి జగన్ జాతకం మారబోతోందట. 

ప్రస్తుతం జగన్ కు బుధ మహాదశ నడుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి బుధమహాదశలో శుక్ర అంతర్దశ ప్రారంభం అవుతుంది. ఈ అంతర్దశ 2025 జూలై 27 వరకు వుంటుంది. అందువల్ల ఈ అంతర్దశ కాలంలో జగన్ కు అన్ని విధాలా బాగుంటుంది అన్నది ఆ జ్యోతిష్కుని విశ్లేషణ.

జాతకం బాగున్నా, ప్రమాణ స్వీకారం చేసిన ముహుర్తం సరైనది కాదని, రవి బలంగా లేని సమయంలో ప్రమాణ స్వీకారం చేయడం వల్ల అనేక అడ్డంకులు వస్తున్నాయని విశ్లేషించారు. 

అయితే సెప్టెంబర్ ను బుధుడిలో శుక్రుడు రావడం వల్ల ఇక అనుకున్నవి అన్నీ అడ్డం లేకుండా చేసుకుంటూ వెళ్తారని వివరించారు.

ఇదిలా వుంటే జగన్ విజయస్థానం…లేదా సాధన స్థానం పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థానం ఒకటే అని. అందువల్ల పవన్ సహకారంతోనే జగన్ కు విజయాలు సిద్దించడం సాధ్యమని చెబుతున్నారు. 

అందువల్లో పవన్ సహకరించక 2014లో అనుకున్నది సాధించకలేక పోయారని, పవన్ సహకరించడం వల్లే 2019లో సిఎమ్ అయ్యారని చెప్పారు. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా