షాకింగ్.. ఏకంగా సముద్రమే మాయమైంది

వాతావరణ మార్పులు కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూమి, ప్రజలు చాలా మార్పులు చూడాల్సి వస్తుందని ఇప్పటికే ప్రకటించింది వరల్డ్ ఎకనమిక్ ఫారమ్. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా…

వాతావరణ మార్పులు కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూమి, ప్రజలు చాలా మార్పులు చూడాల్సి వస్తుందని ఇప్పటికే ప్రకటించింది వరల్డ్ ఎకనమిక్ ఫారమ్. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ సముద్రం భూమిపై నుంచి మాయమైంది.

అవును.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. ఈ భూగోళం పైనుంచి ఏకంగా ఓ సముద్రం మాయమైంది. దాని పేరు అరల్ సముద్రం.

కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న సముద్రం ఇది. దీని విస్తీర్ణం అక్షరాలా 68వేల చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద అంతర్గత నీటి వనరు ఇది. 1960లలో సోవియట్ యూనియన్, వ్యవసాయం కోసం నదుల అనుసంధానం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అరల్ సముద్రంలోకి రావాల్సిన కొన్ని నదుల దారి మళ్లించింది.

దీంతో 290 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సముద్రం, 50 ఏళ్లలో అంతరించిపోయింది. ఒకప్పుడు సోవియట్ నౌకలు తిరిగిన సముద్రం, ఇప్పుడు ఇసుకతో కనిపిస్తోంది. దశాబ్దాల కిందట మునిగిన నౌకలన్నీ ఇప్పుడు తేలాయి.

సైంటిస్టుల అంచనా ప్రకారం 2 మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన సముద్రం ఇది. ఇప్పుడిది 50 ఏళ్లలో కనుమరుగైంది. మిగిలిన భాగాన్ని కాపాడ్ం కోసం, అరల్ సముద్రం ఉత్తర-దక్షిణ భాగాల మధ్య ఒక ఆనకట్టను నిర్మించింది కజకిస్తాన్. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సముద్రాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు.