భానుప్రకాష్ రెడ్డి.. మాయామశ్చింద్రాలు

బిజేపి నినాదం హిందుత్వవాదం.. సనాతన ధర్మాని పరిరక్షించడం.. అందులో భాగంగానే హిందువులు అందరు గర్వపడేలాగా ప్రధాని మోడి గారు అయోద్యలో రామాలయం నిర్మిస్తూన్నారు.. కాశి విశ్వనాథుడి ఆలయాని నభుతో నభవిష్యత్త్ అన్న రీతిలో అభివృద్ది…

బిజేపి నినాదం హిందుత్వవాదం.. సనాతన ధర్మాని పరిరక్షించడం.. అందులో భాగంగానే హిందువులు అందరు గర్వపడేలాగా ప్రధాని మోడి గారు అయోద్యలో రామాలయం నిర్మిస్తూన్నారు.. కాశి విశ్వనాథుడి ఆలయాని నభుతో నభవిష్యత్త్ అన్న రీతిలో అభివృద్ది పరుస్తూన్నారు

అదే తరహాలో టిటిడి ఎప్పటి నుంచో హిందు ధార్మిక ప్రచారంలో భాగంగానే అనేక గోప్ప కార్యక్రమాలను నిర్వహిస్తూంది. జమ్ము నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మించడం… శ్రీవారి భక్తులు వద్దకే స్వామివారిని తీసుకువెళ్ళేలా వైభోవత్సవాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించడం… బిసి, ఎస్టి కాలనీలో ఆలయాలు నిర్మించడం.. వారినే అర్చకులుగా నియమించడం… వైద్య, విద్యాలయాలు ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా కార్పోరేట్ వైద్యాని అందించడం.. ఇలా చెప్పుకుంటు పోతే హిందు ధార్మిక ప్రచారంలో భాగంగా టిటిడి నిర్వహించే కార్యక్రమాలు నభుతో నభవిష్యత్త్ అన్న రీతిలో సాగుతుంది

ఇలా హిందు ధార్మిక వ్యవస్థ పటిష్టానికి టిటిడి విసృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూంటే విహేచ్ పి మొదలుకోని ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు వరకు టిటిడి కార్యక్రమాలను శభాష్ అంటు వుంటే…. తిరుపతి బిజేపి నాయకుడు భానుప్రకాష్ రెడ్డికి మాత్రం అవి నచ్చడం లేదు…ఎందుకంటే ఆయన ఆటలు టిటిడిలో సాగడం లేదన్న భాథతో.. అందుకే టిటిడి పై నిరంతరం ఆరోపణలు చేస్తూ తద్వారా ప్రచారం పోందే ప్రయత్నం చేయ్యడం భాను నైజం….

వాస్తవానికి 1999లో తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ మెంబర్ గా వేంకటస్వామి విజయం సాధిస్తే.. అదే నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో వున్నా 2019 లో వచ్చిన ఓట్లు 2300 అంటే బిజేపి పార్టి ఏ స్థాయికి పడిపోయ్యిందో అర్దం చేసుకోవచ్చు.. దినికి కారణం ఓన్ అండ్ ఓన్లీ భానుప్రకాష్ రెడ్డే అని బిజేపి నాయకులే వాపోతున్నారు. బిజేపి నాయకుడిగా భానుప్రకాష్ రెడ్డి మర్రిచెట్టులా ఎదుగుతు.. తన ప్రక్కన మరో నాయకుడు ఏదగనీవ్వకూండా చూస్తూన్నాడు… దినితో తిరుపతిలో బిజేపి పార్టి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది…నాయకులు కంటే గ్రూప్లే ఎక్కువా అన్నట్లుగా తయ్యారైంది. శాంతారెడ్డి లాంటి పెద్దస్థాయి నాయకులు కూడా భానుప్రకాష్ రెడ్డి దాటికి కనుమరుగైపోయ్యారు. అసలు భానుప్రకాష్ రెడ్డికి రాజకీయ జీవితం ప్రసాదించిన శాంతారెడ్డినే కనుమరుగు చేసేంత విషవృక్షం భానుప్రకాష్ రెడ్డి

తిరుపతిలో వుంటే పరపతి పెరుగుతుంది… అందుకు కారణం శ్రీవేంకటేశ్వరస్వామివారు…. దేశంలో వున్న ఏ నాయకుడైనా స్వామివారి దర్శనానికి రావాలసిందే.. మరి వారికి విమానశ్రయం నుండి తిరిగి సాగనంపే వరకు మరేవ్వరిని దగ్గరికి రానీవ్వకూండా అన్ని దగ్గరుండి చేసినట్లు కలరింగ్ ఇచ్చే నేత భానుప్రకాష్ రెడ్డి(వాస్తవానికి అధికార హోదా వున్న ప్రతి నాయకుడికి టిటిడి ప్రోటోకాల్ పరిధిలో అన్నీ ఏర్పాట్లు స్వయంగా చేస్తూంది…మధ్యలో మేహర్బాని పోందడానికి భాను దూరేస్తూంటాడు) దినికి మూలం తరతరాలుగా కీలకమైన నాయకుడికి భానుప్రకాష్ రెడ్డి క్యారేజిలు మోయడం.. వారి ప్రాపకంతో మరేవ్వరిని దగ్గరికి రానీవ్వకపోవడమే అని బిజేపి నాయకులు వాపోతున్నారు

బిజేపి పార్టిలో ఎవ్వరిని ఎదగనీవ్వకూండా.. తద్వారా పార్టిని కూడా అథ:పాతాళానికి తోక్కేస్తూన్న భానుప్రకాష్ రెడ్డి వ్యవహరశైలిని గుర్తించిన గత రాష్ట్ర‌ అధ్యక్షుడు సోము విర్రాజు భానుకి ఎలాంటి పదవి ఇవ్వకూండా దూరం పెట్టిన.. క్యారేజిలు మోసి ప్రాపకం పోందిన నాయకుడి అనుగ్రహంతో తిరిగి పార్టి పదవిని పోందాడు. 

ఇలా పదవులు పోందే భాను టాలేంట్ ఏమిటి అంటే తిరుపతిలో బిజేపి అంటే భాను.. భాను అంటే బిజేపిలా మార్చేసుకోవడం… వాస్తవానికి పార్టికి ఒక అధ్యక్షుడు వుంటాడు. ఒక కార్యదర్శి వుంటారు, ఇలా కార్యవర్గం వున్నా.. వారేవ్వరు ప్రజలకు తెలియరు. వారు తెలిసే ప్రయత్నం మొదలుపెట్టారో.. అంతలోనే వారిని పదవిచ్యూతుడిని చేసేస్తాడు భాను.. కారణం తిరుపతిలో తాను మాత్రమే నాయకుడిలా చలామణి కావాలి.. తానే దర్శనాలు చెయ్యించాలి.. వాటి ద్వారా సంపాదించాలి.. దానికి మరేవ్వరు అడ్డు రాకూండా వుండాలంటే పార్టిలో ఎవరు ఏదగకూడదు. ఇలా పార్చీని భానునే నాశనం చేస్తూండడంతో.. ఒక్కప్పుడు ఎంపి స్థానాని గేల్చుకున్న పార్టి ఇప్పుడు నోటాతో పోటిపడుతుంది అంటే.. దటీజ్ భానుప్రకాష్ రెడ్డి అని కుమిలిపోతున్నారు నిజమైన బిజేపి నేతలు

ఇంతలా పార్టిని డ్యామేజి చేస్తూన్న భానుప్రకాష్ రెడ్డికి పార్టిలో పరమతి కోనసాగడానికి కారణం మాత్రం క్యారేజిలను మోసి పోందిన నాయకుడి ప్రాపకంతోనే అన్నది జగమేరిగిన సత్యం. ఆ నేత పార్టిని ఏపిలో ఏదగనీవ్వలేదు.. ఈ భాను తిరుపతిలో పార్టిని భూస్థాపితం చేసేస్తూన్నాడు అని గగ్గోలు పెడుతున్నారు బిజేపి నేతలు.. నియోజకవర్గాలను శాసించే స్థాయి వున్న నేతలు కూడా భాను కారణంగా అడవిగాంచిన వెన్నెలా మారిపోతున్నారు. అందుకే భాను పరపతి ఏప్పుడు పోతుందో.. పార్టి ఏప్పుడు బాగుపడుతుందో అని లోలోపలమథనపడిపోతున్నారు బిజేపి నేతలు.