దాంపత్య బంధం లేదా, ప్రేమ బంధం.. స్ట్రాంగ్ గా ఉందనేందుకు రుజువులు కొన్ని ఉంటాయి! ఒకర్నొకరు వదిలి అసలు ఉండలేకపోవడం, విపరీతంగా ప్రేమించేసుకుంటూ ఉంటామని చెప్పుకోవడం, ప్రపంచాన్నంతా మరిచిపోయి.. ఒకరి ధ్యాసలోనే మరొకరు ఉండటం.. ఇవన్నీ బంధం స్ట్రాంగ్ గా ఉందనేందుకు రుజువులో కాదో కానీ, దాంపత్యం లేదా ప్రేమబంధం స్ట్రాంగ్ ఉందనేందుకు చెప్పుకోదగిన ఉదాహరణలు కొన్ని ఉంటాయని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. అందుకు వారు చెబుతున్న రుజువులు ఏమిటంటే!
వాదనలతో తేల్చేసుకోవాలని అనుకోరు!
ఏదైనా ఒక అంశంలో వాదోపవాదాలు చెలరేగినప్పుడు.. ఈ అంశంలో తెగే వరకూ లాగడం అనేది దాంపత్యం బలీయంగా ఉన్నప్పుడు ఉండదు! వాదనలు ఏ దాంపత్యంలో అయినా ఉండేవే. అయితే పూర్తిగా తేల్చేసుకునే వరకూ ఆ వాదనలు కొనసాగవు. వాదన ఆ అంశం మీద వరకే అయినా.. ఒక దశలో వాదనలు ఎవరో ఒకరు అర్థవంతమైన రీతిలో తగ్గడం ద్వారా వీగిపోతాయి!
కొన్ని సార్లు హర్ట్ చేసుకోవచ్చు!
కొన్ని విషయాల్లో ఒపీనియన్స్ ను ఇవ్వడంలో డిప్లొమాటిక్ గా వ్యవహరించకపోవచ్చు! విపరీతమైన డిప్లొమసీ అంత సవ్యమైన సంసారం కాదు! కొన్ని సార్లు అవతలి వాళ్లు హర్ట్ అవుతారనే విషయం తెలిసి కూడా నిజాయితీగా ఒపీనియన్స్ ను ఇవ్వడం ఆరోగ్యవంతమైన దాంపత్యం తాలుకు లక్షణం! ఆ కాసేపు హర్ట్ అయినా.. అసలు సంగతి అర్థమయ్యేది అలా బ్రూటల్ ఆనెస్ట్ గా ఉన్నప్పుడే!
ఒంటరిగా సమయాన్ని ఇవ్వడం!
కొందరికి పుస్తకాల చదవడం ఇష్టం, మరికొందరికి మ్యూజిక్ వినడం ఇష్టం, ఇంకొందరికి సినిమాలకు వెళ్లడం ఇష్టం! ఈ అభిరుచులు పార్ట్ నర్ కు నచ్చలేని, అవే అభిరుచులు ఉండాలని లేదు. ఇలాంటి అభిరుచుల విషయంలో పార్ట్ నర్ ను ఒంటరిగా అయినా ఎంజాయ్ చేయనివ్వడం మంచి దాంపత్యపు లక్షణం! నీకొక్కడికే ఇష్టమైన పనులు చేసుకుంటావా, నేను అప్పుడేం చేయాలి? అనే ప్రశ్న ఇలాంటి చోట ఉండదు. పుట్టుకతోనే ఎవరూ దంపతులు కాదు. వ్యక్తిగతమైన ఆకాంక్షల మేరకు సమయాన్ని ఇవ్వడం సరైన చర్య!
క్షమాగుణం!
తప్పులు అంతా చేస్తారు! కొందరి తప్పు బయటపడతాయి. చర్చకు ఆస్కారం ఇస్తాయి. మరి అలాంటిది జరిగినప్పుడు క్షమించే గుణం కూడా మంచి దాంపత్య లక్షణం. పొరపాట్లను క్షమించేసినప్పుడు ఆ క్షమాగుణం విలువ కూడా చాలా పెరుగుతుందని మరిచిపోవద్దు. సవ్యమైన దాంపత్యంలో క్షమాగుణం కూడా కీలకమైన క్వాలిటీ!
ప్రతి సారీ పొగుడుకోవడం ఉండదు!
పెళ్లికి ముందు విపరీతంగా ఒకర్నొకరు పొగుడుకుంటారని, పెళ్లి తర్వాత అలాంటిది ఉండదనేది అందరూ చెప్పే మాటే! ఇదే నిజం కూడా! మరి వైవాహిక జీవితంలో కూడా అలాంటి హిపోక్రసీ ఉందంటే.. ఎక్కడో తేడా ఉందనే అనుకోవాలి! అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇలాంటి జరుగుతున్నాయంటే ఎక్కడో తేడా ఉందనే అర్థం!