పొలిటిక‌ల్ స‌ర్క‌స్‌

1) గ‌తంలో గొర్రెల్ని పంచారు, ఇపుడు గొర్రెల‌కి డ‌బ్బులు పంచుతున్నారు – ఓట‌రు వ్యాఖ్య‌ Advertisement 2) ఈ సారి కూడా ఫ్యాన్ తిరుగుతుంది కానీ, కాక‌పోతే ప‌వ‌ర్ వుంటుందో లేదో తెలియ‌దు –…

1) గ‌తంలో గొర్రెల్ని పంచారు, ఇపుడు గొర్రెల‌కి డ‌బ్బులు పంచుతున్నారు – ఓట‌రు వ్యాఖ్య‌

2) ఈ సారి కూడా ఫ్యాన్ తిరుగుతుంది కానీ, కాక‌పోతే ప‌వ‌ర్ వుంటుందో లేదో తెలియ‌దు – వైసీపీ అభిమాని

3) చేప‌ల్ని స్విమ్మింగ్ క్లాస్‌లో చేర్చ‌డ‌మే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌

4) తోడేలు రుద్రాక్ష‌మాల తిప్ప‌డ‌మే రాజ‌కీయం

5) ఎపుడు ఎవ‌రి మెడ‌లో వుండాలో అని కండువాలే క‌న్ఫ్యూజ్ అవుతున్నాయి

6) కారు కండిష‌న్‌లో వుంది కానీ, యాక్సిలేట‌ర్‌, బ్రేక్ ఏక‌కాలంలో తొక్కుతున్నారు

7) జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కితే  నాయ‌కులు ఇసుక నొక్కుతున్నారు – వైసీపీ కార్య‌క‌ర్త ఆవేద‌న‌

8) హస్తానికే హ్యాండ్ ఇవ్వ‌డ‌మే కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌త్యేక‌త‌

9) త‌ర‌చూ హెలికాప్ట‌ర్ల‌లో తిరుగుతూ జ‌గ‌న్ గ్రౌండ్ రియాల్టీ మిస్స‌వుతున్నారు – టీ కొట్టు కామెంట్‌

10) ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌లు చేస్కొని ఒకేసారి సంక్రాంతికి పందెం కోడిలా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తాడు – జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆశ‌