Advertisement

Advertisement


Home > Politics - Analysis

తెరాస ను చూసి నేర్చుకోవాలి జగన్

తెరాస ను చూసి నేర్చుకోవాలి జగన్

ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలో, ప్రతిపక్షం మీద ఎగబడకుండానే ఎలా వివరణ ఇవ్వాలో, ప్రతిపక్షం ప్రచారాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెరాస ను ఇంకా క్లారిటీకి చెప్పాలంటే కేటిఆర్ ను చూసి వైకాపా లేదా జగన్ నేర్చుకోవాలి. 

తెలంగాణలో ప్రస్తుతం నూటికి నూరు శాతం మీడియా తెరాస తో లేదు. వీలయినంత సన్నాయి నొక్కులు నొక్కుతూనే వుంది. కానీ సోషల్ మీడియాలో, పబ్లిసిటీలో తెరాస చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

వైకాపా సోషల్ మీడియా దాడి చేయడంలో ముందు వుంది కానీ, తమ పార్టీ పాలనను ప్రచారం చేయడంలో కానీ, వివిధ వర్గాల తో పోస్ట్ లు చేయించడం లో కానీ వెనుకే వుంది. 

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తే వాళ్లను కట్టడి చేయడానికి పోలీసులను వాడుతున్నారు తప్ప, వందలాదిగా వున్న నాయకులు కానీ, సోషల్ మీడియా కింగ్ లు కానీ రంగంలోకి దిగడం లేదు. నాయకులు చాలా మంది కడుపునిండిన బాపతులా వుండిపోయారు. పదవులు ఊడిన వారు తమకెందుకు అన్నట్లు వున్నారు. పదవులు వచ్చిన వారు ఇంకెందుకు అన్నట్లు వున్నారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు భాజపా సంబరాలు జరగుతున్నాయి. ప్రధాని మోడీనే స్వయంగా ఇక్కడకు వస్తున్నారు. ఆ హడావుడిని తెరాస చాలా తెలివిగా కౌంటర్ చేస్తోంది.

తెరాస పాలన ఘన విజయాలు, స్కీములు, ఇతరత్రా విషయాలు అన్నీ పదుల రకాల పోస్టర్లు, హోర్టింగ్ లు తయారు చేసారు. అది కూడా ఇంగ్లీష్ లో ఎక్కువగా. మొత్తం మెట్రో పిల్లర్లు అన్నీ వీటితోనే నింపేసారు. మెట్రో పిల్లర్ నలువైపులా ఇవే. పెద్ద పెద్ద హోర్టింగ్ లు ఇవే. వీటి మధ్య భాజపా జెండాలు, హోర్డింగ్ లు చినబోతున్నాయి. చూస్తుంటే భాజపా సంబరాలు జరుగుతున్నాయా? తెరాస సంబరాలు జరుగుతున్నాయా అన్న హడావుడి కనిపిస్తోంది.

ఎంత సేపూ సాక్షిలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం తప్ప, ఇలాంటి ప్రచారం సాగడం ఆంధ్రలో కనిపించదు. అంతెదుకు ఆంధ్రలో ఫిల్మ్ డివిజన్ ను వాడి పథకాలు ప్రచారం చేసే ఆలోచనలే సాగడం లేదు. సోషల్ మీడియాలో కేటిఆర్ టీమ్ పాజిటివ్ ప్రచారానానికి, వైకాపా టీమ్ దుందుడుకు ప్రచారానికి చాలా తేడా వుంది.

జగన్ కు అంత తీరుబాటు లేదు..గమనించరు. కేటిఆర్ ఎంత బిజీ అయినా చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలను సోషల్ మీడియాలో పక్కా కట్టడి చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?