Advertisement

Advertisement


Home > Movies - Movie News

లైగర్...టఫ్ బాడీ..స్మూత్ ఫ్లవర్స్

లైగర్...టఫ్ బాడీ..స్మూత్ ఫ్లవర్స్

పూరి జగన్నాధ్ పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. సో..పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. 

అందులో భాగంగా హీరో విజయ్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు. ఈ సినిమాలో హీరో బాక్సర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఫిట్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు హీరో.

పోస్టర్ ను డిఫరెంట్ గా తయారు చేసారు. హీరో పూర్తిగా నేకెడ్ గా, తన హాట్ బాడీని ప్రెజెంట్ చేస్తూ కనిపించాడు. కానీ ఒక్క చోట మాత్రం పూలతో కవర్ చేసాడు. 

హీరో లుక్స్, బాడీ, పోస్టర్ అన్నీ క్రేజీగా వున్నాయి. హీరోకి వున్న వున్న యూత్, లేడీ ఫాలోయింగ్ ను క్యాచ్ చేసే లా పోస్టర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది.

పూరి కనెక్ట్ బ్యానర్ మీద చార్మి నిరిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ మైక్ టైసన్ కెీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలవుతుంది. హిందీలో ఈ సినిమా బాధ్యతలు కరణ్ జోహార్ చూస్తున్నారు. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా