ఫసక్! ఎంతైనా మన అమ్మాయి కదా!!

అమెరికాలో ఎన్నికలంటే తెలుగువాళ్లకి సందడే. దానికి కారణం ఇంటికొకడో, నాలుగిళ్లకి ఒకడో అమెరికాలో ఉండడమే.

అమెరికాలో ఎన్నికలంటే తెలుగువాళ్లకి కూడా సందడే. దానికి కారణం ఇంటికొకడో, నాలుగిళ్లకి ఒకడో అమెరికాలో ఉండడమే.

ఎన్నికలైపోయాయి. ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు గెలిస్తే ఏవిటి?

కమలా హారిస్ గెలిస్తే మొదటి భారతీయ మూలాలున్న అమెరికా అధ్యక్షురాలవుతుంది. అది మనకి హ్యాపీయే. పైగా మొదటి మహిళా అమెరికా అధ్యక్షురాలు కూడా. ఆ రికార్డ్ కూడా తనదే అవుతుంది.

అలాగని ఆమె ఓడిపోతే అయ్యో అవుకోవాలా? అక్కర్లేదు.

ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడైతే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అవుతాడు. అతడి భార్య ఉష చిలుకూరి మన తెలుగమ్మాయే. అంటే ఆమె అమెరికాకి తొలి భారతీయ మూలాలున్న సెకండ్ లేడీ అవుతుంది. అలా కూడా మనవాళ్లకి హ్యాపీయే.

అయినా మన తెలుగువాళ్లకి “మన వాళ్లు” అనుకుంటే చాలు..ఆ కిక్కే వేరు. కుదిరితే సేం క్యాస్ట్, లేదా కనీసం సేం స్టేట్, అదీ కుదరకపోతే మన దేశం మూలాలు..ఉంటే చాలు. ఆ తుత్తే వేరు.

ఈ ఆనందాన్ని పక్కన పెడితే వీళ్లల్లో ఎవరు నెగ్గితే ఇండియాకి ప్లస్సు, ఎవరు ఓడితే మైనస్సు?

అసలలాంటి లెక్కలుంటాయా? ఉంటాయనే అనుకోవాలి.

ట్రంప్ గెలిస్తే, అమెరికాకి వెళ్లాలని ఉవ్విళ్లూరే భారతీయ యువతకి హెచ్-1-బి వీసాల నియమాలు స్ట్రిక్ట్ అవుతాయి. ప్రస్తుతానికి ఈజీగా ఉందా అంటే కాదు. కానీ అప్పుడు ఇంకా కఠినతరమవుతాయి. రిపబ్లికన్ల పాలసీ అలాంటిది.

అలాగని విద్యార్థులకి స్టూడెంట్ వీసాలు రావా అంటే.. ఆ దిగులక్కర్లేదు. ట్రంపొచ్చినా, కమల వచ్చినా అమెరికాకి కావాల్సింది డబ్బు. మన వాళ్లు అక్కడ చదువులకోసం బ్యాంక్ లోన్లు తీసుకుని మరీ లక్షలు, కోట్లు గుమ్మరిస్తుంటారు. కనుక ఏ తుప్పాసి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తెచ్చుకున్నా వీసా వచ్చేస్తుంది. అయితే చదువు పూర్తి చేసుకుని, డబ్బు వదిలించుకుని, చేతిలో సర్టిఫికేట్ పట్టుకుని ఇండియా వచ్చేయాలంతే.

అదేంటి…మరి ఉద్యోగమో అని అడిగితే “సారీ” అంటుంది అమెరికా. ఈ పరిస్థితి ట్రంప్ వస్తే అని కాదు. కమల వచ్చినా ఇంతే. ఎందుకంటే అక్కడ డబ్బుకట్టి చదువుకోవడానికి అందరికీ రెడ్ కార్పెట్ పరుస్తారు కానీ ఉద్యోగాలు అన్ని లేవు. బాగా ట్యాలెంటెడ్ అయితే తప్ప అమెరికా కలలు సాకారం కావు.

ఇక చదువు పూర్తైనా కూడా ఏదో రకంగా అక్కడే ఇల్లీగల్ గా ఉండిపోతున్న కొందరు మనవాళ్లున్నారు అక్కడ. వాళ్లని ట్రంప్ వస్తే డిపోర్ట్ చేయడం ఖాయం. ఉన్నంతలో అక్కడ ఎవర్నైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే.. ఆ పిల్లలు సిటిజెన్స్ కాబట్టి కాస్త అలోచించవచ్చు. అదే ఒంటికాయ సొంటికొమ్ముగాళ్లనైతే ఫ్లైటెక్కించి తోలేయడం తధ్యం.

సిటిజెన్స్ ట్రంప్ కావాలనే కోరుకుంటారు. న్యూజెర్సీ ఈ సారి స్వింగ్ స్టేట్ గా మారేలా ఉంది. ఎప్పుడూ గాడిదని నమ్ముకున్న ఈ ప్రాంతం ఈ సారి ఏనుగుని నమ్ముకుంటోంది. అదేలేండి..డెమాక్రాట్ల గుర్తు గాడిద…రిపబ్లికన్ల గుర్తు ఏనుగు.

“ఎవరికేశావు అక్కయ్యా?” అని నాకు తెలిసిన ఒక తెలుగావిడని అడిగాను.

“ట్రంప్ కి వేద్దామనే బయలుదేరాను. కానీ సరిగ్గా ఓటేసే టైముకి రీజినల్ ఫీలింగొచ్చింది తమ్ముడు. కమలకి వేసేసాను. ట్రంప్ కి దెబ్బ కొట్టేసాను. ఒక్కటే దెబ్బ..ఫసక్. ఎంతైనా మన అమ్మాయి కదా”, అంది ఎం.ధర్మరాజు ఎమ్మే లో మోహన్ బాబు టైపులో.

ఇలా ఆఖరి నిమిషంలో గోడ దూకిన వాళ్లు ఎంతమందున్నారో తెలీదు కానీ ఎక్కువ శాతం ట్రంప్ కే బాదారని టాక్.

“ట్రంపుకి ఎందుకేశావురా బావా?” అని నా మిత్రుడొకడిని అడిగాను.

“టెస్లా షేర్లు కొన్నాను. అవి పడుకున్నాయి. వాటిని నిద్రలేపాలంటే ట్రంప్ మావయ్య రావాల్సిందే. అందుకే వేసాను. మా ఆవిడ కమలకి వేస్తానంది. ఈ షేర్ల సంగతి చెప్పాను. ఇంకేమీ ఆలోచించకుండా ట్రంప్ కే వేసింది” అన్నాడు.

ఇదిలా ఉంటే ఒక ట్విస్ట్. ప్రాంతీయ వీరాభిమానం, అవసరం సంగతి పక్కన పెట్టి ప్రాంతీయదురాభిమానం కేండిడేట్ కూడా ఒకడు తగిలాడు. వాడు డెమాక్రాట్ అభిమాని. అప్పట్లో జో బైడెన్ కే వేస్తానన్నాడు. కానీ కమల నిలబడగానే మనసు మార్చుకున్నాడు.

కొన్ని రాత్రుల క్రితం రెండు తాగించి ఎందుకని అడిగితే, “మన ఇండియన్స్ మరీ ఎదిగిపోతే తట్టుకోలేనురా. అది నా వీక్నెస్ అనుకో శాడిజం అనుకో” అని బయటపడ్డాడు.

నేనేమీ షాకవ్వలేదు. తన ఫ్యామిలీలో వీడే మొదటిసారి అమెరికా వచ్చింది. తన తర్వాత ఎవ్వరు వద్దామని ప్రయత్నిస్తున్నా డిస్కరేజ్ చేసేవాడు. తన కజినో, ఫ్రెండో వస్తే డల్లైపోయేవాడు. అమెరికాలోకి తాను అడుగు పెట్టేసాక వెనకాల వాళ్లకి డోర్లు క్లోజైపోవాలి అనుకునే టైపు వాడు. తన జాతివాడు ఎవరు ఎదుగుతున్నా తట్టుకోలేడు పాపం. గూగుల్, మైక్రోసాఫ్ట్ హెడ్లు ఇండియన్స్ కావడం కూడా వాడికి రుచించదు. ఆ యాంటి-స్వజాతి ఫీలింగ్ కమల హ్యారీస్ మీద దాకా వెళ్లింది. ఇంతకంటే వివరంగా రాయను. ఈ మాత్రం రాసానంటే వాడు ఈ ఆర్టికల్ చదవలేడు అనే ధైర్యంతో…వాడు టింగ్లీష్ బ్యాచ్.

ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం అని మనం ఇండియాలో అనుకునేటట్టే ఇక్కడా అనుకోవచ్చు. ఎవరు వచ్చినా సిటిజెన్ల జీవితాలు పెద్దగా మారిపోవు.

పెరిగిన ధరలు దిగిరావడం అంత తేలిక కాదు. మహా అయితే ఇంకాస్త పెరగకుండా ఆపగలిగితే చాలు అనుకునే పరిస్థితి. ట్రంప్ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి కానీ, పదవొచ్చాక వాటి మీద నిలబడి ఉంటాడా లేక మొక్కుబడిగా చేస్తూ, “డెమాక్రాట్లు భ్రస్టు పట్టించారు కాబట్టి రిపేర్ చేయడానికి కష్టంగా ఉంది” అంటాడా అనేది చూడాలి.

మన దగ్గర అంతే కదా! చంద్రబాబు చేసిన అప్పుల మోత వల్లే రాష్ట్రాన్ని నడపడం కష్టంగా ఉందని అప్పట్లో జగన్ అన్నాడు. అదే డైలాగ్ పదవిలోకొచ్చాక బాబుగారు కూడా అన్నారు. కనుక అదే డైలాగుని ట్రంప్ మావయ్య కూడా ఇంగ్లీషులోకి డబ్ చేసి వాడుకుంటాడేమో.

ఒకవేళ కమల హ్యారీస్ వస్తే ఏవిటి అనేది తెలీదు. ఆమె బైడెన్ కి 2.0 వర్షన్ అవుతుందని అనుకుంటున్నాం. ఏమో..ఆమె సొంత మార్గంలో కొత్త పాలన చూపిస్తుందేమో అనే ఆశ కూడా ఉంది.

కనుక ఎవరొచ్చినా సినిమా చూస్తున్నట్టో, రియాలిటీ షో చూస్తున్నట్టో చూడడం తప్ప చేసేదేం లేదు. అంతవరకు “జై కమల”, “జై ఉష” అనుకుంటూ రీజినల్ ఫీలింగుతో టైం పాస్ చేస్తాం.

ధరణికుమార్ పట్టభద్రుల

20 Replies to “ఫసక్! ఎంతైనా మన అమ్మాయి కదా!!”

  1. 70% Indians voted to Trump only

    Indians who voted today ..They dont like the people who are coming to USA now a days

    Reason1: Last 8, 9 years ….80% of MS students are scrap batch …reputation is going down

    Reason 2: Caste feeling , abusing the system , overaction , రవితెజ వెటకారం ..ఇవన్ని ఎక్కువైపొయాయి ..

    Thats why Indians who are voting today are frustrated with newly coming Red bus batch from India ….to control these scrap batch..Trump is the only option ..thats why they voted Trump

  2. abbo chaana choosam le. UK lo rishi sunak babu aa suella braverman kalisi chesina chettha choosaka kooda mana desa moolalu vunte manakedo anukune picchi mindset manesthe better.

  3. If Trump wins ,he can tighten the immigration rules

    80% of Indians voted to Trump because of following reasons,

    Reason 1: Last one decade all scrap batch is coming from India

    Reason 2: Now a days 90 % of people coming from Inida are …Over-Action, caste feeling , Abusing system, Reckless behavior ..

    One Thing is True ..people who are coming now days are most irritating batch

  4. If Trump wins ,he will tighten the immigration rules

    80% of Indians voted to Trump because of following reasons,

    Reason 1: Last one decade all scrap batch is coming from India

    Reason 2: Now a days 90 % of people coming from Inida are …Over-Action, caste feeling , Abusing system, Reckless behavior ..

    One Thing is True ..people who are coming now days are most irritating batch

    ఇప్పుడు USA లొ వొట్లెస్తున్న Indiansకి .. ఇప్పుడిప్పుడె USA కు వచ్చిన… వస్తున్న వారి బిహెవియర్ అస్సలు నచ్చడం లెదు because of Reason 2

  5. If Trump wins ,he will tighten the immigration rules

    80% of Indians voted to Trump because of following reasons,

    Reason 1: Last one decade all scrap batch is coming from India

    Reason 2: Now a days 90 % of people coming from Inida are …Over-Action, caste feeling , Abusing system, Reckless behavior ..

    One Thing is True ..people who are coming now days are most irritating batch

    ఇప్పుడు USA లొ వొట్లెస్తున్న Indiansకి .. ఇప్పుడిప్పుడె USA కు వచ్చిన… వస్తున్న వారి బిహెవియర్ అస్సలు నచ్చడం లెదు because of Reason 2

  6. ఇప్పుడు USA లొ వొట్లెస్తున్న Indiansకి .. ఇప్పుడిప్పుడె USA కు వచ్చిన… వస్తున్న వారి బిహెవియర్ అస్సలు నచ్చడం లెదు because of Over-Action, caste feeling , Abusing system, Reckless behavior ..

    To control these scrap…majority Indian voted Trump

    1. టాక్స్ వసూల్ రాజా మోడీ కి మూడింది , ఇండియా లో పేదల మీద ఎడా పెడా పన్ను , అమెరికా నుండి ఇంపోర్ట్స్ మీద పన్ను , ఇండియా నుండి ఎక్సపోర్ట్స్ మీద మాఫీ ఇలా మొత్తం నాకించేసాడు గత 10 ఏళ్ళు మోడీ పాలన అస్తవ్యస్తం

  7. మార్పు కోసం అంటూ ఒబామా వచ్చి అప్పట్లో మార్చింది ఏమిటి? అందుకని ఎవరు వచ్చినా తేడా చూపించడం, గొప్పగా చెయ్యడం కష్టం!

    1. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కి ఉన్న పేరు ప్రఖ్యాతులు పీవీ కి లేవు. ఎన్టీఆర్ పాలన వల్ల సంక్షేమం వుంది. కాని ఉద్యోగాలు వచ్చి మనీ రొటేషన్ అవుతుంది అంటే కారణం పీవీ!

        1. కాని టీడీపీ మీడియా రైటర్ లకి తెలుగు ప్రముఖులు అంటే పీవీ గుర్తుకు రారు, ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు!

  8. మీ “మన” అమ్మాయి ఓడిపోతుంది అట, ఎర్లీ ప్రాజెక్షన్స్ ట్రంప్ 198, మన అమ్మాయి 109!

Comments are closed.