అన్నగారి తరం అంతరిస్తొంది!

వెండి తెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అక్కడ తనదైన మార్క్ ని క్రియేట్ చేశారు.

వెండి తెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అక్కడ తనదైన మార్క్ ని క్రియేట్ చేశారు. ఆయన ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వారు అంతా ప్రజా జీవితంలో కొన్ని విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచారు.

ఎన్టీఆర్ రాజకీయల్లో ప్రవేశించిన నాటికే రాజకీయాల్లో ఒక రకమైన గబ్బు ఆవరించింది. దానిని ప్రక్షాళన చేయడం కోసం ఆయన విద్యావంతులను సేవా తత్పరత ఉన్న వారిని మధ్యతరగతి వర్గాలను పేదలను సగటు వ్యక్తులను ప్రోత్సహించారు

ఆ తరంలో చూస్తే ఎక్కువ మంది ఉపాధ్యాయులు అన్న గారి పిలుపు అందుకుని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు కీలక శాఖలు నిర్వహించినా నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు.

అలాంటి వారిలో ఒకరు సత్యం మాస్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం పెదగోగాడ గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ మాస్టారుగా జన పరిచితులు. ఆయనను ఎన్టీఆర్ ప్రోత్సహించారు. తెలుగుదేశంలో సత్యం మాస్టార్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అయిదు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలోనూ కీలక పదవులు ఆయనకు ఇచ్చారు.

ఆయన 99 ఏళ్ల వయసులో నవంబర్ 5న మరణించారు. విలువలకు కట్టుబడిన ఒక తరం ఆయన మృతితో అంతరించింది అని చెప్పాలి. అన్న గారి తరంలోని ఒక మంచి నాయకుడు కనుమరుగు అయ్యారని కూడా అంతా పేర్కొంటున్నారు. ఆయన మంత్రిగా చేసినా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేవారు.

ఉన్నత పదవులు అధిరోహించినా సైకిల్ నే వాహనంగా చేసుకుని గ్రామాలు తిరిగి ప్రజల సమస్యలను చూసేవారు. అలాంటి నేతలు ఇక ముందు కనిపిస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తెలుగుదేశంలోనూ అన్న గారి తరం అన్నది ఇపుడు కనిపించడం లేదు అన్నది కూడా ఉన్న మాటే.

కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పుట్టిన టీడీపీని ఎన్టీఆర్ సమయంలో ఎందరో నాయకులు చేరి నిబద్ధతతో నడిపారు. ఆ నిబద్ధత వర్తమాన రాజకీయాల్లో చూడలేమన్నది ఒక చేదు నిజం.

13 Replies to “అన్నగారి తరం అంతరిస్తొంది!”

  1. ఒరేయ్ కిస్కా… ఇప్పుడు ఇడిస్తే అంతా జగన్ గాడి దోపిడీలు, దొమ్మీలు, రేపులు మర్దర్లు చేసే గుంపు… నువ్వు కూడా అదే చెప్పాలి అనుకొన్నావ్ కదా…

Comments are closed.