ఐపీల్ 2025 సీజన్ ప్రారంభం కాకముందునుంచి దాని ప్రచార ప్రకటనలు టీవీచానెళ్లలో హోరెత్తిపోయాయి. అలాంటి అనేక ప్రకటనల్లో ఒకటి మహేంద్ర సింగ్ ధోనీ- సంజూ శాంసన్ మధ్య డిస్కషన్ లాగా నడుస్తుంది.
సంజూ శాంసన్ ను ఉద్దేశించి.. ‘‘సంజూ.. పద్నాలుగేళ్ల కుర్రాడితో ఆడిస్తున్నావట’’ అని అడుగుతాడు ధోనీ. ‘అవు’నంటాడు సంజూ. ‘అతడు పుట్టకముందే మనం ఐపీఎల్ గెలిచాం’ అంటాడు ధోనీ. ‘పర్వాలేదులే అన్నా.. నువ్వు రిటైరయ్యేలోగా అతను కూడా కొడతాడులే’అంటాడు సంజూశాంసన్. ఐపీఎల్ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు మొదలయ్యాయి గానీ.. ఆ పద్నాలుగేళ్ల కుర్రాడెవరో గానీ గ్రౌండ్ లోకి దిగనేలేదు. కొన్ని మ్యాచ్ లు గడచిపోయాయి.
కెప్టెన్ సంజూ శాంసన్ ఆ కుర్రాడిని డగౌట్ కు మాత్రం పరిమితం చేస్తూ వచ్చాడు. చివరికరి సంజూ గాయం కారణంగా మ్యాచ్ లకు దూరం అయిన తర్వాత.. ఓపెనర్ పాత్రను పోషించడానికి అదే పద్నాలుగేళ్ల కుర్రవాడిని బరిలోకి దింపాల్సి వచ్చింది. ఆ కుర్రాడి పేరు వైభవ సూర్యవంశీ!
ఐపీఎల్ బరిలో నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి అడుగు తొలిసారిగా స్ట్రయిక్ లోకి రాగానే తాను ఎదుర్కొన్న మొట్టమొదటి బంతిని సిక్స్ గా తరలించడం ద్వారా.. స్టేడియం గ్యాలరీలు మొత్తం ఉలిక్కి పడేలా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరు అనేది ఏమాత్రం లెక్క చేయకుండా ఎడాపెడా సిక్స్ లు బాదేస్తూ.. హాఫ్ సెంచరీకి చేరువ అయి… అవుటయ్యాడు. తొమ్మిదో క్లాసుచదువుతున్న ఆ పసివాడు.. కళ్లమ్మట నీళ్లు కారుతుండగా.. హెల్మెట్ తీసి.. నెమ్మదిగా డగౌట్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆడిన రెండో మ్యాచ్ అంతగా కలిసి రాలేదు.
తీరా మూడో మ్యాచ్ అవకాశం సోమవారం నాడు వచ్చింది. పటిష్టమైన జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్ తో పోరు. వాళ్లేమో ఫస్ట్ బ్యాటింగ్ లో భారీ స్కోరుచేసి ఏకంగా 210 పరుగుల టార్గెట్ పెట్టారు. జైస్వాల్ తో కలిసి యథావిధిగా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వచ్చాడ.. వైభవ్ సూర్యవంశీ. తనకు స్ట్రయిక్ రాగానే అలవాటుగా సిక్స్ తో ప్రారంభించాడు.
కామెంట్రీ చెబుతున్న వారికి ఎంతసేపే అతడి పద్నాలుగేళ్ల పసిప్రాయాన్ని కీర్తించడానికే సమయం సరిపోయింది. గుజరాత్ టైటన్స్ తరఫున గట్టి బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్.. ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. ప్రతి ఒక్కరికీ ఒక్క సిక్స్ నైనా రుచిచూపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే
=) అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడుగా 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
=) ఈ సెంచరీలో కేవలం 7 మాత్రమే ఫోర్లు. కానీ ఏకంగా 11 సిక్స్ లు కొట్టాడంటే.. అతని బ్యాటింగ్ విధ్వంసం ఊహించుకోవచ్చు.
=) ఇషాంత్ శర్మ లాంటి సీనియర్ బౌలరు అతని విధ్వంసానికి జడిసి, బంతి అందకుండా వేయడానికి ఒకే ఓవర్లో రెండు వరుస వైడ్ లు వేశాడంటే అర్థం చేసుకోవచ్చు.
=) 14 ఏళ్ల 32 రోజుల వయస్సులో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన హీరోగా వైభవ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు.
=) ఏకంగా 265.78 రన్ రేటుతో అతని బ్యాటింగ్ విధ్వంసం సాగడం గమనార్హం.
మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజను తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడో లేదో తెలియదు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం మూడంటే మూడే మ్యాచ్ లతో తన పేరు ఈ దేశంలోని క్రికెట్ అభిమానులు ఎవ్వరూ మరచిపోలేని ప్రతిభను ప్రదర్శించాడు.
కంగ్రాట్స్.. వైభవ్ సూర్యవంశీ!
Wonderful.. powerful innings


మొహంలో పసి ఛాయలు వున్నాయి కానీ.. పర్సనాలిటీ చూస్తుంటే 14 లా లేదే!
వన్ టైం వండర్ కాకుండా ..లాంగ్ స్పాన్ లో క్లాసిక్ క్రికెట్ ఆడాలి.ఈ మ్యాచ్ లో చాలా వరకు లక్ కూడా కల్సి వచ్చింది.ఇలాంటి ఇన్నింగ్స్ ల లో సహజమే..Let’s wait ..
Steroids emanna teesukuntunnada, correct age ena ane vishayalu chudali…Kinda Aditya annatlu, luck chala undi and technicalga weak anipistundi. Young kabatti, jagrathaga undi develop ayithe, left-handed tendulkar avutademo!
జగన్ కి చెప్పు, వెళ్ళి నెత్తి మీద చెయ్ వేసి ఆశీర్వదిస్తాడు
Intha waste gadivi entra. Kodhiga aina context vundali, kula gajji bevarsga
వంటలోడికి ఇక్కడేం పని రా
Jagan ni kalavarincha lekunda okka roju vundaremo..