Advertisement

Advertisement


Home > Politics - Analysis

వర్షాల చుట్టూ రాజకీయాలు

వర్షాల చుట్టూ రాజకీయాలు

మనిషి జీవితాన్నే కాదు రాజకీయాలను కూడా పంచ భూతాలు శాసిస్తున్నాయి. నీరు అన్నది పంచ భూతాల్లో ఒకటి. అలాంటి నీరు చుట్టూ ప్రాజెక్టుల రాజకీయాలు ఎలాగూ వుంటూ వస్తున్నాయి. అలాంటి నీటికి ఆధారమైన వర్షాలు కూడా రాజకీయాలకు కారణం అవుతున్నాయి. 

చంద్రబాబు అధికారంలో వున్నపుడు సరిగ్గా వర్షాలు పడలేదు. అప్పట్లో దాన్ని వైకాపా రాజకీయం చేసింది. వైఎస్సార్ టైమ్ లో సకాలంలో వర్షాలు పడడం, చంద్రబాబు టైమ్ లో పడకపోవడంతో ఆ రాజకీయం వర్కవుట్ అయింది.

జగన్ వచ్చిన తరువాత సకాలంలో వర్షాలు పడుతూ వస్తున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. అందువల్ల వైకాపా ప్రభుత్వం పుల్ హ్యపీగా వుంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది అనుకోకుండా వర్షాకాలం కన్నా ముందుగానే మొదలైపోయాయి. రైతులు కూడా అనుకోలేదు. నారుమళ్లు సిద్దం చేసుకునే లోగానే వర్షాలు వచ్చేసాయి.

ఇప్పుడు ఇవే వర్షాలు ప్రతిపక్ష రాజకీయానికి అండగా మారాయి. ఎప్పుడైతే వర్షాలు రోజుల తరబడి కురస్తున్నాయో, రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా వున్న రోడ్లు మరింత పాడయ్యాయి. ఇవన్నీ యుద్ద ప్రాతి పదికన బాగు చేయాలంటే వేల కోట్లు కావాలి. అంతే కాదు. ముందు వర్షాలు ఆగాలి. ఇవన్నీ జరగడానికి కనీసం మూడు నాలుగు నెలలు టైమ్ పడుతుంది.

ఇదే అవకాశంగా అంది పుచ్చుకుంటున్నాయి ప్రతిపక్షాలు. ఎలాగూ మీడియా దన్ను బ్యాక్ గ్రవుండ్ లో వుంది కనుక కింది స్థాయి నుంచి బాగు లేని రోడ్ల ఫొటొలు అన్నీ తెప్పించి అందిస్తుంటే సోషల్ మీడియాను నింపేయడం ప్రారంభించారు. 

నిజానికి కొన్ని రోడ్లు బాగా లేని మాట, కొన్ని రోడ్లు బాగుచేసిన సంగతి రెండూ నిజమే. కానీ రెండవది మాయమైంది. మొదటి దాని మీద హడావుడి మొదలైంది.

ఆ రోజు జగన్ కు అండగా నిలిచింది వర్షమే. ఈ రోజు ‘రోడ్ల పాలు’ చేస్తున్నది వర్షమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?